👉405 మంది కళాకారులకు ప్రదర్శన!
J.SURENDER KUMAR,
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో వివిధ రాష్ట్రాలకు చెందిన 16 బృందాలు 405 మంది కళాకారులకు వర్షపు జల్లులలో వారు ప్రదర్శించిన వివిధ భంగిమలలో ప్రదర్శించిన నృత్య కళా ఘటనలు భక్తులను మంత్రముగ్ధుల్ని చేసింది.

సూర్యప్రభ వాహన సేవలో వివిధ రాష్ట్రాలకు చెందిన 16 బృందాలకు చెందిన మొత్తం 405 మంది కళాకారులు పాల్గొని తమ కళా నైపుణ్యాన్ని ప్రదర్శించారు.

తిరుపతిలోని టిటిడి ఆధ్వర్యంలోని శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాల విద్యార్థుల భరతనాట్యం, కూచిపూడి నృత్యాలు, అస్సాం రాష్ట్రానికి చెందిన

జోయా బృందం ప్రదర్శించిన బిహు నృత్యం, పంజాబ్‌కు చెందిన రాహుల్ హెగ్డే బృందం ప్రదర్శించిన గురియో నృత్యం, బెంగళూరుకు చెందిన గౌరీ బృందం ప్రదర్శించిన శ్రీరామ విజయం నృత్య బ్యాలెట్, విశాఖపట్నంకు చెందిన రూపశ్రీ బృందం ప్రదర్శించిన ఆదిత్య నామం భక్తులను ఆకట్టుకుంది

.
విజయ బృందం చేసిన దాదాండియా నృత్యంతో పాటు అనకాపల్లికి చెందిన ధనలక్ష్మి బృందం చేసిన శింబు నృత్యం, రాజమండ్రికి చెందిన నాగలక్ష్మి బృందం చేసిన డప్పులు, విజయవాడ, విశాఖపట్నం, శ్రీకాకుళం బృందాలు ప్రదర్శించిన కోలాటాలు భక్తులను భక్తి పారవశ్యంలో ముంచెత్తాయి.



