సుపరిపాలనకు నిదర్శనం హర్యానాలో  హ్యాట్రిక్ విజయం!


👉 అమర్ నాథ్ సారంగుల !

👉బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి !


.J.SURENDER KUMAR,


భారతీయ జనతా పార్టీ సుపరిపాలన, డబుల్ ఇంజన్ సర్కార్ ఉండాలని ఓటర్ల  ఆకాంక్షకు అనుగుణంగానే హర్యానా రాష్ట్ర ప్రజలు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి మూడోసారి పట్టం కట్టారని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి అమర్ నాథ్ సారంగుల  ప్రకటనలో పేర్కొన్నారు.


ఎన్నికల ఫలితాలతో ప్రతిపక్షా పార్టీలు.షాక్ కు గురై పరేషాన్ అవుతున్నారని అన్నారు. కొందరు నాయకులు,  బిజెపి పార్టీని, నాయకులను ఈవీఎంలు ట్యాంపరింగ్ చేశారని, బిజెపి విజయాన్ని ఒప్పుకోమని  ఆరోపించడం వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని. కమల్నాథ్ ప్రకటనలో పేర్కొన్నారు.

👉అమర్నాథ్ సారంగుల రాష్ట్ర అధికార ప్రతినిధి !

హర్యానాలో బీజేపీ గెలుపుకు కారణాలు. ఇవి అంటూ ప్రతిపక్షాలకు విజ్ఞప్తి చేశారు.


👉గత పదేళ్లుగా 16లక్షల పేద కుటుంబాలకు ఇండ్లు కట్టించడం..


👉 రైతుల కోసం 24రకాల పంటలకు కనీస మద్దతుధర (MSP) ఇవ్వటం..


👉40 లక్షల కుటుంబాలకు ఆయుష్మాన్ భారత్ ఉచిత వైద్య సదుపాయం..


👉ఓబీసీలకు ప్రత్యేక బడ్జెట్ కేటాయించి అమలు చేయటం..


👉ఎక్కడా అవినీతి లేకుండా ఉద్యోగాలు ఇవ్వటం..


👉 ఉన్నత విద్య చదువుతున్న మహిళలకు 100% స్కాలర్షిప్ సదుపాయం…


👉 కోటిమంది పేదలకు ఉచిత రేషన్ ఇవ్వటం..


👉 ప్రతి ఇంటికి నల్లా నీరు ఇవ్వటం…


👉 ఎస్సీల కోసం ప్రత్యేక పోలీసు స్టేషన్లు పెట్టి ఎస్సిలపై జరిగే అఘాయిత్యాలకు తగ్గించటం.


👉 నాయకత్వ మార్పుతో ఓబీసీలకు మరింత విశ్వాసం కల్పించటం…


👉 గురుగ్రాంలో అన్ని ప్రైవేట్ కంపెనీల్లో లోకల్ యువతకు ఉద్యోగాలు ఇచ్చే ప్రయత్నం..


👉 శాంతి భద్రతలు కల్పించి కొత్త కొత్త పెట్టుబడులను ఆకర్షించడం..


అన్నింటికీ మించి ప్రధాని మోడీ.పై పేదలకు, మహిళలకు, రైతులకు, యువతకు ఉన్న విశ్వాసం, భారతదేశంలో ప్రభుత్వ వ్యతిరేకతను జయించే ఏకైక ఆయుధం – సుపరిపాలన అంటూ ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అమర్ నాథ్ సారంగుల ప్రకటనలో పేర్కొన్నారు.