👉ధర్మపురి మండలంలో..
J.SURENDER KUMAR,
బంధుత్వాలు రక్త సంబంధాలు అంతరిస్తున్నా నేటి ఆధునిక పరిస్థితులలో, రక్తం పంచుకొని పుట్టిన తన తమ్ముడు మృతి చెందిన వార్త తెలిసి అక్క కట్కూరి నరసమ్మ మృతి చెందిన సంఘటన జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం దొంతపూర్ గ్రామంలో గురువారం అర్ధరాత్రి జరిగింది.
వివరాలు ఇలా ఉన్నాయి.
దొంతపూర్ గ్రామానికి చెందిన గొల్లపల్లి గంగారం ( మాజీ నక్సలైట్ అగ్రనేత, పోలీసు రికార్డులలో నమోదు అయి ఉంది) అనారోగ్యానికి గురి అయిన గంగారం జగిత్యాల తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. గుజరాత్ నుంచి కుటుంబ సభ్యులు రాక కోసం దొంతపూర్ లో శవం ఉంచారు. అదే గ్రామంలో గంగారం అక్క నరసమ్మ నివాసం.
తమ్ముడు గంగారం మృతి చెందిన విషయం గురువారం రాత్రి పదిగంటలకు తెలిసి నరసమ్మ కన్నీరు మున్నేరుగా రోధిస్తూ మృతి చెందింది. మరో సోదరుని ఇదే మండలం రామయ్య పల్లె గ్రామంలో నివాసం ఉంటుంది.
👉గంగారం నక్సల్స్ దేన్ కీపర్ ?
1978 లో దొంతపూర్ భూస్వామి ఇంటిపై దాడి సంఘటనలో పలువురితో పాటు అమాయకుడైన గంగారం పేరు పోలీసు రికార్డులో నమోదయింది. ఈ నేపథ్యంలో భయంతో గ్రామం విడిచి గంగారం భీమండికి పారిపోయాడు. అక్కడ కార్మికుడిగా పని చేస్తూ ఓ యువతిని పెళ్లి చేసుకున్నాడు. జీవనోపాధి కోసం భార్యాభర్తలు గుజరాత్ కు వెళ్లారు. వారికి ఇద్దరు ఆడపిల్లలు. గుజరాత్ లో కార్మిక సంఘం నాయకుడిగా గంగారంకు గుర్తింపు. నక్సలైట్ కార్యకలాపాలకు దశాబ్దాల కాలంగా ఆయన దూరంగా ఉంటూ భార్యాపిల్లలతో కిరాణం వ్యాపారం చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు.
తన కూతుర్ని తన సోదరి కుమారుడికి ఇచ్చి పెళ్లి చేసే ప్రయత్నంలో ( ఇన్ఫార్మర్ వ్యవస్థ ద్వారా గంగారం యత్నించగా ఆచూకీ రాష్ట్ర పోలీసులు కనుగొన్నారు) దీంతో 2009- 2010 గుజరాత్ రాష్ట్రం సూరత్l లో గంగారం ఇంటిపై ఇక్కడి పోలీసులు మెరుపు దాడి చేసి గంగారం ను అదుపులోకి తీసుకున్నారు. గుజరాత్ పోలీసులు ఈపాటికి తాము షోహాబుద్ధిన్ ఎన్కౌంటర్ తో సతమతం అవుతున్నామని, ఇక్కడ కోర్టులో ప్రవేశపెట్టి పిటి వారెంట్ పై తీసుకెళ్లాలని సూరత్ పోలీసులు ఇక్కడి పోలీసులు అడ్డుకున్నారు.
అక్కడి కోర్టులో గంగారం ను హాజరు పరిచారు. పోలీసులు గంగారం ను. జగిత్యాల కు తీసుకువచ్చారు. పోలీస్ అధికారులు మీడియా సమావేశంలో తాము పట్టుకున్న గంగారం నక్సస్ డేన్ కీపర్ అంటూ వెల్లడించారు. అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.
గంగారం ను పోలీసులు పట్టుకున్న తీరు, గంగారం కుటుంబ జీవన విధానం, భార్యా పిల్లలు సూరత్ లో ఆయన ఆధార్, ఓటర్ ఐడి కార్డులు. ఇద్దరు ఆడపిల్లల ఫోటోలతో. గంగారం పట్టుబడింది ఇలా అంటూ. ప్రముఖ దినపత్రికలో నాడు. వార్త ప్రచురితమైన అయిన వార్తకు. న్యాయమూర్తులు , పోలీస్ అధికారులు స్పందించారు.
అప్పటి దొంతపూర్ మాజీ సర్పంచ్ బుచ్చయ్య, జరిగిన ఉదాంతం స్వర్గీయ దేవాదాయ శాఖ మాజీ మంత్రి జువాడి రత్నాకర్ రావు వివరించారు.
రత్నాకర్ రావు జోక్యం చేసుకొని అప్పటి ప్రభుత్వానికి పరిస్థితిని వివరించి గంగారాం ను జైలు నుంచి విడుదల చేయించారు. గంగారం పక్షాన ధర్మపురి మాజీ ఎంపీపీ న్యాయవాది బెత్తపు లక్ష్మణ్ వాదించారు.