J.SURENDER KUMAR,
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం సాయంత్రం రంగనాయకుల మండపంలో 2025 సంవత్సరానికి సంబంధించిన టీటీడీ డైరీలు, క్యాలెండర్‌లను ఆవిష్కరించారు.
అందులో 12 షీట్ క్యాలెండర్లు -13.50 లక్షలు, పెద్ద డైరీలు – 8.25 లక్షలు, చిన్న డైరీలు – 1.50 లక్షలు, టేబుల్‌టాప్ క్యాలెండర్లు – 1.25 లక్షలు, శ్రీవారి పెద్ద క్యాలెండర్లు 3.50 లక్షలు, అమ్మవారి పెద్ద క్యాలెండర్లు -10 వేలు, శ్రీవారు-పద్మావతి అమ్మవారు – 4 లక్షల తెలుగు క్యాలెండర్లు ఉన్నాయి. పంచాంగం – 2.50 లక్షల కాపీలు, 6-షీట్ క్యాలెండర్లు -50,000 ఉన్నాయి.
దేవాదాయ శాఖ మంత్రి రాంనారాయణరెడ్డి, ఈవో జె శ్యామలరావు, అడిషనల్ ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, ఇతర ఉన్నతాధికారులు, టిటిడి అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ క్యాలెండర్‌లు, డైరీలు అన్ని టిటిడి బుక్‌స్టాల్స్‌లో తొలుత తిరుమల, తిరుపతిలోని అన్ని టిటిడి బుక్‌స్టాల్స్‌లోనూ, ఆ తర్వాత బయటి ప్రదేశాలలోనూ భక్తుల దృష్ట్యా త్వరలో అందుబాటులో ఉంచనున్నారు.