తిరుమల ఆలయంలో దీపావళి ఆస్థానం నేపథ్యంలో అక్టోబర్ 31న వీఐపీ బ్రేక్ దర్శనాన్ని ( ప్రోటోకాల్ వీఐపీలు మినహా ) టీటీడీ రద్దు చేసింది. ఈ నేపథ్యంలో అక్టోబరు 30న తిరుమలలో సిఫారసు లేఖలు స్వీకరించబడవు.
భక్తులు ఈ విషయాన్ని గమనించి టీటీడీకి సహకరించాలని కోరారు.
👉నవంబర్‌లో తిరుమలలో ప్రత్యేక ఉత్సవాలు!
నవంబర్ నెలలో నిర్వహించే ప్రత్యేక పండుగల వివరాలు ఇలా ఉన్నాయి !
👉నవంబర్ 01 – నవంబర్ 1న కేదార గౌరీ వ్రతం
👉నవంబర్ 03 – భగినీహస్త భోజనం, శ్రీ తిరుమల నంబి సాత్తుమొర
👉నవంబర్ 05 – నాగుల చవితి, పెద్ద శేష వాహనం.
👉నవంబర్ 06 – శ్రీ మణవాళ మహాముని శాత్తుమొర
👉నవంబర్ 08 – వార్షిక పుష్పయాగానికి అంకురార్పణం
👉నవంబర్ 09 – శ్రీవారి పుష్పయాగం, అత్రి మహర్షి వర్ష తిరు నక్షత్రం, పిళ్ళైలోకాచార్య వర్ష తిరు నక్షత్రం, పోయిగై ఆళ్వార్ వర్ష తిరు నక్షత్రం, పుడత్తాళ్వార్ వర్ష తిరు నక్షత్రం, వేదాంత దేశికుల శాత్తుమొర
👉నవంబర్ 10 – పెయాళ్వార్ వర్ష తిరు నక్షత్రం
👉నవంబర్ 11 – శ్రీ యాజ్ఞవల్క్య జయంతి
👉నవంబర్ 12 – ప్రబోధన ఏకాదశి
👉నవంబర్ 13 – కైశిక ద్వాదశి ఆస్థానం, చాతుర్మాస్య వ్రతం సమాప్తం
👉నవంబర్ 15 – కార్తీక పౌర్ణమి
👉నవంబర్ 28 – ధన్వంతరి జయంతి
👉నవంబర్ 29 – మాస శివరాత్రి