త్వరగా ధాన్యం కొనుగోలు చేయాలి ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్

J.SURENDER KUMAR,

రైతులు ఆరుగాలం కష్టపడి పండించి అమ్మకానికి తెచ్చిన వరి ధాన్యం ను నిర్వాహకులు త్వరగా కొనుగోలు చేయాలని ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.


సోమవారం నియోజకవర్గంలో పెగడపెల్లి మండలం నంచర్ల, రఘు రాముల పల్లె, ఎండపెల్లి మండలం కేంద్రం, కొండాపూర్ గ్రామంలో గొల్లపెల్లి మండలం శకరపట్నం, వెంగళాపూర్ గ్రామాల్లో నూతనంగా ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రారంభించారు
.


ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రభుత్వ నిబంధనల మేరకు, రైతులకు ఇబ్బందులు కలగకుండా, తాలు తప్ప పేరిట తూకంలో అదనంగా వడ్లను తూకం చేయవద్దని అధికారులను, సిబ్బందిని ఆదేశించారు.

ADVERTISEMENT


ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు