విజయదశమి వేడుకల్లో సామాన్య భక్తుడి లా శాసనసభ్యుడు !

J.SURENDER KUMAR,


చట్టసభలకు ప్రాతినిథ్యం వహిస్తున్న ఎమ్మెల్యే అతను, ప్రభుత్వ విప్ కూడా, అయినా భగవంతుడి సన్నిధిలో అందరూ సమానమే అంటు సామాన్య భక్తుడి తరహాలో విజయదశమి వేడుకల్లో పాల్గొన్నారు.
ప్రముఖ పుణ్యక్షేత్రమైన ధర్మపురిలో శనివారం అంగరంగ వైభవంగా విజయదశమి ఉత్సవాలు జరిగాయి. ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ సామాన్యుడిలా ఈ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకొని ఉత్సవాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.


వివరాల్లోకి వెళ్తే..


విజయదశమి రోజున స్థానిక దైవం శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఉత్సవ మూర్తుల, పల్లకి సేవలో అశ్వ వాహనంపై ఊరేగింపుగా కిలోమీటర్ దూరంలో శ్రీ అక్క పెళ్లి రాజరాజేశ్వర స్వామి ఆలయం సమీపంలో ఉన్న జమ్మి గద్దె కు వెళ్తారు. అక్కడ స్వామివారికి, జమ్మి వృక్షానికి వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం వాటి ఆకులు తీసుకుంటారు.

స్థానిక ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్, ఆలయానికి చేరుకొని, స్వామివారి ఉత్సవ సేవ పల్లకి నీ కొద్ది దూరం భక్తుల తో కలిసి మోశారు.

దాదాపు కిలోమీటర్ కు పైగా భక్తులతో కాలి నడకన సేవ పల్లకి వెంట నంది చౌక్, శివాజీ చౌక్, హనుమాన్ వాడ, అంబేద్కర్ చౌక్, ఉండ జమ్మి గద్దె కు వెళ్లారు. అక్కడ స్వామివారి ప్రత్యేక పూజాది కార్యక్రమంలో పాల్గొని హనుమాన్ విగ్రహం, చంద్ర టాకీస్, బస్టాండ్, గాంధీ చౌక్, తోట్లవాడ, ఇసుక స్తంభం, ఆలయం వరకు భక్తులతో కలిసి వెళ్లారు. ఉత్సవాలు అనంతరం స్వామివారి పల్లకి మోసిన బోయవారికి, కాగడా పట్టుకున్న నాయిని బ్రాహ్మణులకు, ప్రోత్సాహకంగా నగదు ఇచ్చి వారిని ఎమ్మెల్యే ప్రశంసించారు.


👉 ఈవో గారు నా రాక కోసం భక్తులను ఇబ్బంది పెట్టకండి !


దసరా ఉత్సవాల ఏర్పాట్లు పై రెండు రోజుల క్రితం జమ్మిగద్దె దేవాదాయ రెవెన్యూ అధికారులతో కలిసి ఎమ్మెల్యే పరిశీలించారు. లైటింగ్ ఏర్పాటు, తాగునీటి సౌకర్యం, పిచ్చి మొక్కలు తొలగింపు తదితర అంశాలపై సమీక్షించారు.

ఈ సందర్భంగా ఆలయ కార్య నిర్వహణాధికారి సంకటల శ్రీనివాసు తో. ” ఈవో గారు, విజయదశమి ఉత్సవ వేడుకలకు నా రాక కోసం మీరు వేచి ఆలస్యం చేయవద్దు, సనాతన సాంప్రదాయ ప్రకారం సమయపాలన పాటించండి. నా రాక కోసం పూజాది కార్యక్రమాల నిర్వహణ ఆలస్యం చేస్తూ భక్తులకు ఇబ్బందులకు గురి చేయవద్దని ఆదేశించారు.

సార్ ఆలయం నుంచి స్వామివారి పల్లకి సాయంత్రం 4:30 కి వెళుతుందని, ఉత్సవ సమయాలను ఎమ్మెల్యేకు ఈవో వివరించారు. నేను సకాలంలో ఉత్సవాల్లో పాల్గొనడానికి వస్తాను, ఒకవేళ ఆలస్యమైన మీ విధి విధానాల ప్రకారం ఉత్సవాలు నిర్వహించండి అంటూ అధికారులు ఉద్యోగుల సమక్షంలో ఈవో ను ఎమ్మెల్యే ఆదేశించారు.

విజయదశమి ఉత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే పాల్గొని ప్రవర్తించిన తీరును పట్టణ ప్రజలు ప్రశంసిస్తున్నారు.