👉 నేడు ప్రారంభించనున్న ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ !
J.SURENDER KUMAR,
ప్రముఖ పుణ్యక్షేత్రమైన ధర్మపురి పట్టణ ప్రజల, మరియు యాత్రికుల సౌకర్యార్థం ప్రతిరోజు రాత్రి 11 గంటలకు ధర్మపురి క్షేత్రం నుంచి హైదరాబాద్ కు. ఎయిర్ కండిషన్ బస్ ప్రారంభం కానున్నది.
స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్డూరి లక్ష్మణ్ కుమార్, యాత్రికుల పట్టణ ప్రజల సౌకర్యార్థం ఏ సి బస్ అవశ్యకత ను ఆర్టీసీ అధికారులకు వివరించారు. స్థానిక ప్రజల అవసరాల నిమిత్తం హైదరాబాద్ కు ధర్మపురి నుంచి నేరుగా బస్సు సౌకర్యం కల్పించాలని ఆదేశించారు. ఈ మేరకు శుక్రవారం మధ్యాహ్నం ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ ప్రారంభించనున్నారు.