👉మలేషియా తెలంగాణ అసోసియేషన్ దశాబ్ది ఉత్సవాలలో…
👉మంత్రి శ్రీధర్ బాబు…
J.SURENDER KUMAR,
ప్రపంచ దేశాల్లో ఎక్కడ మనవాళ్లు ఉన్న వాళ్ల కష్ట సుఖాల్లో మేము పాలు పంచుకోవాలని అనుకుంటాం అని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు.
మలేషియా తెలంగాణ అసోసియేషన్ (MYTA) దశాబ్ది ఉత్సవాలు (10వ వార్షికోత్సవం లో ) లో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, జ్యోతి వెలిగించి ప్రారంభించారు ఎమ్మెల్సీ టిపిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

అనంతరం మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ…
👉పదేళ్లు పూర్తి చేసుకున్న మలేషియన్ తెలంగాణ అసోసియేషన్ కు తెలంగాణ ప్రభుత్వం తరుపున మంత్రి శ్రీధర్ బాబు శుభాకాంక్షలు తెలుపుతూ పార్టీలకు అతీతంగా ఇక్కడికి వచ్చాం అన్నారు.
👉రాష్ట్రానికి వెళ్తే మా సిద్ధాంతాలకు అనుగుణంగా నడుచుకుంటాం..మీ ప్రయాణంలో మా వంతు సహకారం ఉండాలని ఇంతదూరం వచ్చాం మీ పక్షాన మేము అందరం ఉన్నాం అన్నారు.
👉తెలంగాణ ప్రజలు భవిష్యత్ లో అన్ని దేశాల్లో అన్ని రంగాల్లో ముందు ఉండాలి ఆకాంక్షిస్తున్నా..
👉ఎక్కడ ఉన్నా తెలంగాణ వాసులకు ప్రభుత్వం అండగా ఉంటుంది. అన్నారు
ఈ కార్యక్రమంలో భారతీయ ప్రవాసులు పాల్గొన్నారు