ఆలయాలకు ₹ 573 కోట్లు విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి !

J.SURENDER KUMAR,


రాష్ట్రంలో పుణ్యక్షేత్రాలు, ఆలయాల అభివృద్ధి కోసం సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ₹ 573.50 కోట్ల నిధులు విడుదల చేసింది.


ఆదిలాబాద్, వరంగల్, మహబూబాబాద్, రంగారెడ్డి, జనగామ, కరీంనగర్, ఖమ్మం, మంచిర్యాల, పెద్దపల్లి, నల్లగొండ, నిజామాబాద్ , రాజన్న సిరిసిల్ల జిల్లాలలోని దాదాపు 16 దేవాలయాల అభివృద్ధి కొరకు ఈ నిధులు ప్రభుత్వం విడుదల చేసింది.

ఆలయాల లో చేపట్టాల్సిన పనుల డిజైనింగ్, తదితర కసరత్తు ను దేవాదాయ శాఖ పూర్తిచేసి నివేదికలు ప్రభుత్వానికి పంపించింది. ఈ నివేదికలను ఆర్థిక శాఖ క్లియరెన్స్ ఇచ్చినట్టు సమాచారం,

ఈ నేపథ్యంలో దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ, సీనియర్ ఐఏఎస్ అధికారిని, రామ శైలజ అయ్యంగార్, నవంబర్ 30 లో గా ఇ-ప్రొక్యూర్మెంట్ ద్వారా పనులు టెండర్ ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించినట్లు తెలిసింది.