J.SURENDER KUMAR,
గ్రామాల్లో అంగన్వాడి కేంద్రాలు, గర్భిణీలు బాలింతల కు పౌష్టికాహారం ఇస్తూ కేంద్రాలలో పిల్లల ఆలయ పాలన చేస్తూ ఆదర్శప్రాయంగా ఉండాలని ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.

ప్రజా పాలన ప్రజా విజయోత్సవాలలో భాగంగా పంచాయతీరాజ్ మరియు గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద మంజూరు కాబడి బుగ్గారం మండలం యశ్వంత రావు పేట గ్రామంలో ₹ 12లక్ష వ్యయంతో నిర్మించనున్న నూతన అంగన్వాడి భవన నిర్మాణానికి మంగళవారం ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు.
అనంతరం అంగన్వాడిల ఆధ్వర్యంలో నిర్వహించిన అన్న ప్రాసన కార్యక్రమంలో పాల్గొని పిల్లలకు యూనిఫాం లను పంపిణీ చేశారు.
👉₹ 2.30 కోట్ల పనులకు భూమి పూజ!

పంచాయతీరాజ్ మరియు గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో సి.ఆర్.ఆర్ గ్రాంట్ కింద మంజూరు అయినా ఎండపెల్లి మండలంలోని సూరారం గ్రామం నుండి గోపాలరావు పేట గ్రామం వరకు ₹ 2 . 30 కోట్ల వ్యయంతో బిటి రోడ్డు మరియు బ్రిడ్జి నిర్మాణానికి మంగళవారం ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ శంకుస్థాపన చేశారు.
ఈ కార్యక్రమంలో అధికారులు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు .