అన్ని వర్గాలకు న్యాయం చేకూర్చే దే మన రాజ్యాంగం !

👉ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ !


J.SURENDER KUMAR,


భారత దేశంలో ఉన్న అన్ని వర్గాల వారికి న్యాయం చేకూర్చే విధంగా మన రాజ్యాంగాన్ని అంబేద్కర్ రూపకల్పన చేశారు అని ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.


భారత రాజ్యాంగాన్ని ఆమోదించి నేటికీ 75 సంవత్సరాలు పూర్తయిన సంధర్భంగా ధర్మపురి పట్టణంలోని స్థానిక అంబేద్కర్ విగ్రహం దళిత సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన చేసిన వేడుకల్లో ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు.


ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..

దేశ ప్రజలందరికీ న్యాయం, స్వేచ్ఛ,సమానత్వం, సౌభ్రాతృత్వాల ను అందిస్తూ రూపొందించబడిన మన భారత రాజ్యాంగాన్ని 1949, నవంబర్ 26 న ఆమోదించబడిన సందర్భంగా దళిత సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉందని,
భారత దేశంలో ఉన్న అన్ని వర్గాల వారికి న్యాయం చేకూర్చే విధంగా రాజ్యాంగాన్ని అంబేద్కర్ రూపొందించడం జరిగిందన్నారు.

వారి బాటలో నడుస్తూ వారి ఆశయాలను నెరవేర్చడమే అంబేద్కర్ కు మనం ఇచ్చే ఘనమైన నివాళి అని ఈ సందర్భంగా ఎమ్మెల్యే అన్నారు.


ఈ కార్యక్రమంలో దళిత సంఘ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.