👉 ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ !
J.SURENDER KUMAR,
ధర్మారం మండలా రైతాంగానికి మేడారం రిజర్వాయర్ గుండెకాయ వంటిదని, రిజర్వాయర్ ఏర్పాటు చేస్తామని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించి నాటి మంత్రి హరీష్ రావు హామీని విస్మరించారని, ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ అన్నారు.
ధర్మారం మండలంలోని పత్తిపాక వద్ద నూతనంగా నిర్మించనున్న పత్తిపాక రిజర్వాయర్ కి సంబంధించిన స్థలాన్ని మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ ,ఎమ్మెల్యే విజయ రమణారావు ,ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఇరిగేషన్ అధికారులు, మండల నాయకులతో కలిసి ఆదివారం పరిశీలించారు.
👉ఈ సందర్భంగా ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ..
రిజర్వాయర్ ఏర్పాటు తో ధర్మపురి నియోజకవర్గం తో పాటు పెద్దపెల్లి, రామగుండం నియోజకవర్గం లోని రైతులకు సాగునీరు అందించాల నే ఉద్దేశంతో మంత్రి శ్రీధర్ బాబు దృష్టికి, సిఎం దృష్టికి, ఉప ముఖ్యమంత్రి భట్టి గ దృష్టికి ప్రాజెక్టు నిర్మాణం అవసరం గూర్చి వివరించడం జరిగిందన్నారు. అందులో భాగంగా మంత్రి శ్రీధర్ బాబు స్థల పరిశీలనకు రావడం చాలా సంతోషంగా ఉందని ఈ సంధర్భంగా ఎమ్మెల్యే అన్నారు.
2014 సంవత్సరం కి ముందు మన ప్రాంతానికి నీళ్ళు ఇస్తామని హామీ ఇచ్చి గత పాలకులు అట్టి హామీని మార్చిపోయారని, ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ వివరించారు.
గత ప్రభుత్వంలో మంత్రిగా వ్యవహరించిన హరీష్ రావు ఇక్కడి దొర ఇంట్లో పడుకొని రెండు గుట్టల నడుమ రిజర్వాయర్ ఏర్పాటు చేస్తామని దానికి లక్ష్మీనరసింహ స్వామి రిజర్వాయర్ అని పేరు పెడతామని రైతుల సమక్షంలో హామీ ఇచ్చినట్టు వివరించారు.
ఆరు కోట్లు మంజూరు చేసి రాడల్ సర్వే చేస్తామని హామీ ఇచ్చి విస్మరించారని అన్నారు ఈ నేపథ్యంలో మంత్రి శ్రీధర్ బాబు స్థల పరిశీలనకు రావడం చాలా సంతోషంగా ఉందని ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ అన్నారు.