J.SURENDER KUMAR,
ప్రముఖ పుణ్యక్షేత్రం ధర్మపురిలోని శ్రీ అయ్యప్ప స్వామి ఆలయ అభివృద్ధికి అన్ని విధాల సహకరిస్తానని ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
ధర్మపురిలోని అయ్యప్ప స్వామి ఆలయ 18 వ వార్షికోత్సవం శుక్రవారం అంగరంగ వైభవంగా జరిగింది.

పెండ్యాల బాలకృష్ణ గురుస్వామి జరిగిన పదు నెట్టాంబడి పూజ, కార్యక్రమంలో ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు. ఎమ్మెల్యే గురు స్వామి తీర్థప్రసాదాలు అందించి స్వామివారి శేషా వస్త్రం బహుకరించారు.
👉అన్నదానం.

ఆలయ వార్షికోత్సవం సందర్భంగా అయ్యప్ప స్వాములకు, భక్తజనంకు ఏర్పాటుచేసిన అన్నదాన ఆర్థిక వనరులను ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ ఆలయ నిర్వాహకులకు అందించారు. వందలాదిమంది అయ్యప్ప స్వాములు భక్తులు స్వామివారి అన్న ప్రసాదం స్వీకరించారు.
👉స్వాగత తోరణం కు నిధులు మంజూరు చేస్తా !

అయ్యప్ప స్వామి ఆలయం లో తాగునీటిలో సతీష్ సౌకర్యాలతో పాటు అయ్యప్ప స్వాముల విజ్ఞప్తి మేరకు స్వాగత తోరణం ( ఆర్చ్ ) నిర్మాణానికి నిదులు మంజూరు చేయిస్తానని ఎమ్మెల్యే స్వాములకు హామీ ఇచ్చారు. అయ్యప్ప స్వాముల తో కలిసి భోజనం చేసారు.
👉18 వార్షికోత్సవం సందర్భంగా..

ఆలయం ఆవిర్భవించి 18 సంవత్సరం సందర్భంగా గురువారం బాలకృష్ణ గురుస్వామి ఆధ్వర్యంలో ఆలయంలో గణపతి సహస్రావర్తన, గణపతి హోమది పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి.
శుక్రవారం స్వామి వారి మూలవిరాట్ కు క్షీరాభిషేకం. ఆలయం నుంచి గోదారి నది వరకు శోభాయాత్రగా అయ్యప్ప స్వాములు ఆరట్టు ఉత్సవం నిర్వహించారు. మధ్యాహ్నం ఆలయంలో పడి పూజా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
👉సుదర్శన సహిత లక్ష్మీనరసింహ యాగంలో పాల్గొనడం పూర్వజన్మ సుకృతం !
ధర్మపురి క్షేత్రంలో జరుగుతున్న సర్వ కామప్రద సుదర్శన సహిత లక్ష్మీనరసింహ యాగంలో పాల్గొనడం నా పూర్వజన్మ సుకృతమని ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ అన్నారు.
శ్రీ వికానస సుధర్మ సేవా సమితి ఆధ్వర్యంలో
శ్రీమాన్ పరంకుశం కృష్ణ సాయి భట్టాచార్యుల పర్యవేక్షణలో ధర్మపురి బ్రాహ్మణ సంఘ భవన ఆవరణలో సర్వ కామప్రద సుదర్శన సహిత లక్ష్మీనరసింహ యాగం రెండు రోజులపాటు అంగరంగ వైభవంగా జరిగింది.

వేలాదిమంది భక్తజనం యాగం తిలకించారు. శుక్రవారం జరిగిన పూర్ణాహుతి కార్యక్రమంలో ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్, ప్రముఖ గుండె వైద్య నిపుణుడు డాక్టర్ శ్రీధర్ కస్తూరి, బ్యాంకింగ్ ఆర్థిక రంగ నిపుణుడు గుండె విష్ణు ప్రసాద్, రాష్ట్ర బిజెపి నాయకుడు రామ్ సుధాకర్ రావు, దేవదాయశాఖ రిటైర్డ్ డిప్యూటీ కమిషనర్ దూస రాజేశ్వర్, స్థానిక యాగ నిర్వాహక సహాయకులు సంగనభట్ల దినేష్, నందగిరి చంద్రశేఖర్ ( గిరి ) ఇందారపు రామయ్య, ఆలయ ఎగ్జిక్యూటివ్ అధికారి సంకటాల శ్రీనివాస్, పాల్గొన్నారు.