J.SURENDER KUMAR,
ప్రమాదవశాత్తు విద్యుత్ ఘాతకానికి గురి అయిన బాధితుడు కోడిపెల్లి సందీప్ కు ప్రభుత్వం ద్వారా ₹ 2 లక్షల రూపాయల ఆర్థిక సహాయం ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్డూరి లక్ష్మణ్ కుమార్ అందించారు
ధర్మారం మండలం మల్లాపూర్ గ్రామానికి చెందిన సందీప్ గత కొన్ని రోజుల క్రితం ధర్మారం మార్కెట్ యార్డులో విధులు నిర్వహిస్తూ ప్రమాదశాత్తూ విద్యుత్ షాక్ తగిలింది. బాధితుడి కుటుంబ ఆర్థిక పరిస్థితి ని ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ జిల్లా కలెక్టర్ మరియు సొసైటి వారికి వివరించి ₹ 2 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని మంజూరు చేయించారు
గురువారం. ధర్మారం మార్కెట్ కమిటీ చైర్మన్ మరియు సొసైటి చైర్మన్ తో కలిసి సందీప్ కుటుంబానికి ఆర్థిక సహాయం చెక్ ను అందించారు. ఈ సంధర్బంగా ఎమ్మెల్యే కు సందీప్ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.