J.SURENDER KUMAR,
కరీంనగర్ జిల్లా పర్యటనలో ఉన్న రాష్ట్ర బిసి కమిషన్ చైర్మన్ జి.నిరంజన్ ను శుక్రవారం ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మర్యాద పూర్వకంగా కలిసారు.
ఈ సందర్భంగా సామాజికంగా, ఆర్థికంగా వెనకబాటుతనానికి గురి అవుతున్నవంటి బలహీన వర్గాలకు (బిసి) రాజ్యాంగబద్ధంగా స్థానిక సంస్థల ఎన్నికలలో మరియు ఇతర విద్యా, ఉద్యోగ, ఆర్థిక సంక్షేమ కార్యక్రమాలలో కల్పించవలసిన రిజర్వేషన్ సౌకర్యాలను కల్పించాలని కోరుతూ బీసీ చైర్మన్ కు వినతి పత్రం ఇచ్చారు.