బీఆర్ఎస్ మాటలను ప్రజలు నమ్మరు ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ !


J.SURENDER KUMAR,


లగ్గజరలో రైతుల ముసుగులో కలెక్టర్ పై దాడిలో కూడా ప్రతిపక్ష పార్టీల హస్తం ఉందని, కేసీఆర్ ఓ మాట, కేటీఆర్ ఓ మాట, హరీష్ రావు మాటలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.


కార్తీక పౌర్ణమి సందర్భంగా శుక్రవారం వెల్గటూర్ మండలంలోని కోటిలింగాల శ్రీ కోటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు చేశారు.
అనంతరం ఆలయ అర్చకులు, స్వామి వారి తీర్ధ ప్రసాదాలను అందించారు. మండల నాయకులతో కలిసి కోటిలింగాల గోదారి నదిలో బోటింగులో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ


ముగ్గురు బీఆర్ఎస్ నాయకులు పొంతన లేని విధానాన్ని అవలంబిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం ను ప్రజలు అసహ్యించుకుంటున్నారన్నారు.
పవిత్ర కార్తీక మాసంలో ఆ దేవ దేవుడైన మహా శివుని ఆశీస్సులు నియోజకవర్గ ప్రజానీకం పైన మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై ఎల్లవేళలా ఉండాలని, ఆ దేవదేవుడి ఆశీస్సులతో విజయవంతంగా కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన కొనసాగించడం జరుగుతుందని, ప్రతిపక్షాలు స్వయంగా సమస్యలను సృష్టించి వాటిని పరిష్కరించాలని అనవసర ఆందోళనలు చేయడం అరణ్య రోదన అవుతుందని ఆరోపించారు.

👉వసతులు ఎందుకు కల్పించలేదు..

వేలాది మంది భక్తజనం గోదావరి నదిలో పవిత్ర స్నానాల కోసం వస్తారని తెలిసి మహిళా భక్తులు దుస్తులు మార్చుకోవడానికి ఏర్పాట్లు ఎందుకు చేయలేదని కోటిలింగాల ఆలయ కార్య నిర్వాహణాధికారిపై ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవాదాయ కమిషనర్ కు ఫోన్ చేసి ఈవో విడుదల పట్ల నిర్లక్ష్య వైఖరి ని వివరించారు. భక్తుల వాహనాలు పార్కింగ్ స్థలం ఏర్పాట్లు ఎందుకు చేయలేదు జిల్లా పంచాయతీ గారిని ఫోన్ చేసి ప్రశ్నించారు.


మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు ఎమ్మెల్యే వెంట ఉన్నారు.