J.SURENDER KUMAR,
జగిత్యాల జిల్లా బుగ్గారం గ్రామ పంచాయతీలో నిధుల దుర్వినియోగం అనే అభియోగం పై లోకాయుక్త లో గురు – శుక్ర వారాలు రోజుల పాటు విచారణ జరిగింది.
జగిత్యాల జిల్లా పంచాయతీ అధికారి (డీఆర్ డిఎ – పిడి), యం.రఘు వరన్ కార్యాలయ అసిస్టెంట్ ఉద్యోగులు అల్లె రాజేందర్, కొలగాని మురళి, బుగ్గారం మండల పంచాయతీ అధికారి అఫ్జల్ మియా, ప్రస్తుత పంచాయతీ కార్యదర్శి అక్బర్ లు లోకాయుక్త కు హాజరయ్యారు.
ఫిర్యాదు దారుడు చుక్క గంగారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం జిల్లా పంచాయతీ అధికారుల తప్పుడు సమాచారం పై “లోకాయుక్త” ఆగ్రహించి అధికారులకు చీవాట్లు పెట్టింది. లక్షల రూపాయలు రికవరీ చేసి కూడా
సరైన సమయంలో చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించినట్టు తెలిపారు. బాధ్యులపై క్రిమినల్ కేసులు ఎందుకు నమోదు చేయలేదని జిల్లా పంచాయతీ అధికారులను లోకాయుక్త మందలించిందన్నారు.
.గ్రామ పంచాయతీ పై వచ్చిన పిర్యాదుల విచారణ నాలుగేండ్లు గడిచినా పూర్తి కాలేదంటే మిగతా గ్రామ పంచాయతీల పరిస్థితి ఏమిటనీ, మిగతా పిర్యాదుల సంగతేమిటని లోకాయుక్త అధికారులను ప్రశ్నించింది అన్నారు
బుగ్గారం గ్రామ పంచాయతీ నిధుల దుర్వినియోగంలో చేపట్టిన పూర్తి విచారణ, తీసుకున్న చర్యల పూర్తి సమాచారంతో వారానికే రావాలని లోకాయుక్త ఆదేశాలు జారీ చేసింది. కేసు తుది విచారణను డిసెంబర్ 6 కు వాయిదా వేసింది అన్నారు.