“చట్టం” సీఈఓ ప్రసాద్ ను సన్మానించిన ట్రస్మ !


J.SURENDER KUMAR,


నూతనంగా ఎన్నుకోబడ్డ నిజామాబాద్ జిల్లా ఎగ్జిక్యూటివ్ బాడీ తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్ మేనేజ్మెంట్ అసోసియేషన్ (ట్రస్మా) ఆద్వర్యంలో శుక్రవారం చట్టం సీఈవో సిరిగాధ ప్రసాద్ ను ట్రస్మా అధ్యక్షుడు లయన్ కొడాలి కిషోర్ ఘనంగా సన్మానించారు.


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేటి సమాజంలో స్కూల్, కాలేజీల వ్యవస్థ పై కళ్ళకు కట్టినట్లుగా ప్రచూరి వచ్చిన వార్త కథనాలు, విద్యార్థులకు, తల్లిదండ్రులకు చూపేందుకు కృషి చేసిన చట్టం టివి, చట్టం దినపత్రిక యాజమాన్యం, సిబ్బందిని అభినందించారు. అంతే కాకుండా కాలేజి యాజమాన్యం నేడు ఎదుర్కొంటున్న సమస్యలను సమాజానికి పరిచయం చేయడం సంతోషంగా ఉందన్నారు.