👉 సీఐడీ విచారణ కు ఆదేశించిన ప్రభుత్వం !
J.SURENDER KUMAR,
పోలీసులు చేపడుతున్న కొన్నినేర విచారణలో జాప్యం ? లేదా నేరానికి పాల్పడిన ఆధారాలు లభ్యం కానీ సందర్భంలో ? సాధారణంగా ఆయా ప్రభుత్వాలు సిఐడి విచారణకు ఆదేశించడం అందరికీ తెలిసిన విషయమే. అయితే సాక్షాత్తు ముఖ్యమంత్రి కి సమోసాలు తినిపించడానికి తెప్పించిన సమోసాలు ఎవరు తిన్నారో ? అనే అంశంపై ఆ రాష్ట్ర ప్రభుత్వం సిఐడి విచారణకు ఆదేశించడం పలు రకాల చర్చలకు అవకాశం ఇస్తున్నది.
👉 వివరాల్లోకి వెళితే..
హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్విందర్ సింగ్ సుక్కు కోసం ఆర్డర్ చేసి తెప్పించిన సమోసాలు ఎవరు తిన్నారు ? అనే సంఘటనపై ఆ రాష్ట్ర ప్రభుత్వం సిఐడి విచారణకు ఆదేశించింది.
ఆ సమోసాలు సీఎం వద్దకు ఎందుకు చేరలేదు ? ఈ విషయంలో ఎవరు నిర్లక్ష్యం వహించారు ? .. ఈ ప్రశ్నల నే హిమాచల్ ప్రదేశ్ సీఐడీ విభాగం దర్యాప్తు చేస్తోంది.
సీఎం కోసం ప్రత్యేకంగా తెప్పించిన సమోసాలు ఆయనకు ఎందుకు అందలేదన్న విషయంలో సీఐడీ బాస్ విచారణకు ఆదేశాలు జారీచేశారు.
ఈ సంఘటనపై. ఓ సీనియర్ అధికారి ఎంక్వైరీ చేపట్టడంతో ఆసక్తికర విషయాలు వెలుగు చూస్తున్నాయి.
అక్టోబర్ 21 న సీఎం సుఖ్వింద్ సింగ్ సుక్కు సిమ్లా లో సీఐడీ సైబర్ వింగ్ స్టేషన్ క్వార్టర్స్
(సైబర్ వింగ్‌లోని సిటిజన్ ఫైనాన్షియల్ సైబర్ ఫ్రాడ్ రిపోర్టింగ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్) ప్రారంభించడానికి వచ్చారు.
సీఎం కోసం సమోసాలు, కేకులు తెప్పించాలని ఓ ఐజీ ర్యాంక్ అధికారి ఎస్సైకి ఆదేశాలు జారీ చేశారు. ఆయన ఏఎస్సై, హెడ్‌కానిస్టేబుల్‌తో కలిసి షిమ్లాలోని లక్కర్ బజార్‌లో ఉన్న ఐదు నక్షత్రాలు రాడిసన్ బ్లూ హోటల్‌కు వెళ్లారు. మూడు బాక్సుల్లో సమోసాలు, కేకులు తీసుకొచ్చారు. ఆ బాక్సులను MT విభాగానికి పంపించారు. అక్కడి నుంచి సీఎం వద్దకు సమోసాలు చేరాల్సి ఉంది.

అయితే ఈ సమోసాలు, కేకుల బాక్స్ లు ఎవరికి ఇవ్వాలనే దానిపై MT విభాగంలో అక్కడ విధులు నిర్వహించే పోలీసులకు క్లారిటీ లేదు. వివరాలు చెప్పాల్సిన ఎస్సై చెప్పలేదు. దీంతో ఆ సమోసాలు అక్కడ విధుల్లో ఉన్న భద్రతా సిబ్బందికి పంపిణీ చేశారు.
సమావేశంలో ఉన్న సీఎంతోపాటు, సీఐడీ బాస్, ఇతర ఉన్నతాధికారులు ఆర్డర్ ఇచ్చిన సమోసాలు తినకుండానే వెళ్ళిపోయారు. దీంతో తాను సీఎంకు మర్యాదలు చేయలేకపోయామన్న అవమానం సీఐడీ బాస్‌ను వెంటాడింది. ఎంక్వైరీ వేయడంతో సమన్వయ లోపమే దీనికి కారణమని తేలింది.
ఈ విషయాన్ని పోలీసు ప్రధాన కార్యాలయం కాకుండా, సీఐడీ విచారిస్తోందని డీజీపీ అతుల్ వర్మ చెప్పారని ఏఎన్ఐ వార్తా సంస్థ పేర్కొంది.
సీఎం సీఐడీ ప్రధాన కార్యాలయానికి హాజరైనప్పుడు, ఆ కార్యక్రమానికి వచ్చినవారి జాబితా చాలా పెద్దగా ఉంది. వారిలో సీఐడీ డీఐజీ, డీఐజీ క్రైమ్, సైబర్‌క్రైమ్ డీఐజీ తదితరులు ఉన్నారు.
సీఎం సుఖు వెంట స్థానిక ఎమ్మెల్యే హరిశ్ జనార్ద, పంచాయతీ రాజ్ మంత్రి అనిరుధ్ సింగ్ హాజరయ్యారు. సీఎం కోసం తెప్పించిన సమోసాలు ఎవరు తిన్నారో ? అనే విషయం సిఐడి నివేదికలో భద్రంగా ఉన్నట్టు చర్చ.
(B B C News) సౌజన్యంతో