👉సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారు!
👉ప్రణాళిక బద్ధంగా ధర్మపురి ఆలయ అభివృద్ధి చేస్తాం !
👉ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు !
J. SURENDER KUMAR,
ధర్మపురి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ అభివృద్ధి కి నిధులు కేటాయించమని మీ ఎమ్మెల్యే , ప్రభుత్వ విప్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ , సీఎం రేవంత్ రెడ్డికి, దేవదాయ శాఖ మంత్రి కొండా సురేఖకు ఇచ్చిన వినతి పత్రంపై వారు సానుకూలంగా స్పందించారని, శాసనసభ వ్యవహారాలు, ఐటీ ,పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు.
గురువారం మంచిర్యాలలో పలు అభిృద్ధి కార్యక్రమాలలో పాల్గొని మంత్రి శ్రీధర్ బాబు గంభీరావు పేట వెళుతూ మార్గ మధ్యంలో ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ క్యాంప్ కార్యాలయంలో తేనీటి విందు లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ, ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులతో, నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో ఏర్పడిన మా ప్రభుత్వ పది నెలల కాలంలో మీ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్, సోదరుడు లక్ష్మణ్ కుమార్ , నియోజకవర్గంలో చేస్తున్న అభివృద్ధి పనులకు నా అభినందనలు, ఆశీస్సులు, కాంగ్రెస్ కార్యకర్తలకు సైతం శుభాకాంక్షలు అని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు.
ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం ప్రణాళిక బద్ధంగా అభివృద్ధి చేస్తాం, అభివృద్ధి విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు మంత్రి కొండ సురేఖ కు విప్ లక్ష్మణ్ వినతి పత్రం ఇవ్వడంతో పాటు క్షేత్ర అభివృద్ధి అంశం వివరించినట్టు మంత్రి తెలిపారు.

వారు సానుకూలంగా స్పందించడం తోపాటు ప్రణాళిక బద్ధంగా అభివృద్ధికి త్వరలో స్వీకారం చుట్ట బోతున్నట్టు మంత్రి శ్రీధర్ బాబు వివరించారు.
👉మంత్రి శ్రీధర్ బాబుకు సాదర స్వాగతం..

మంచిర్యాలలో వివిధ అభివృద్ధి పనులలో పాల్గొని గంభీరావు పేట వెళ్తున్న మంత్రి శ్రీధర్ బాబు ను ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ మంత్రికి శాలువా కప్పి కార్యకర్తలతో సాదరంగా స్వాగతించారు.