J.SURENDER KUMAR,
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం వరంగల్ పర్యటనలో భాగంగా ముందస్తు ఏర్పాట్లను మంత్రి శ్రీధర్ బాబు సోమవారం రాత్రి పరిశీలించారు.

మంత్రి తోపాటు ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ,. పెద్దపెల్లి ఎమ్మెల్యే విజయరామారావు,సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, వరంగల్ ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు ఉన్నారు.

సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్న కాళోజీ కళ క్షేత్రాన్ని శ్రీధర్ బాబు పరిశీలించారు. జిల్లా అధికార యంత్రాంగం తో ఏర్పాట్లపై మంత్రి శ్రీధర్ బాబు సమీక్ష సమావేశం నిర్వహించారు.

సీఎం పర్యటన రూట్ మ్యాప్, ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు, విజయోత్సవ సభ తదితరు అంశాలను అధికార యంత్రాంగం మంత్రి ఎమ్మెల్యేలకు వివరించారు. రాత్రి వరంగల్ నగరంలోనే మంత్రి ,ఎమ్మెల్యేలు బస చేశారు.