J.SURENDER KUMAR,
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదినం సందర్భంగా శుక్రవారం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారిని దర్శించుకున్నారు. ఉదయం యాదగిరిగుట్ట చేరుకున్న ముఖ్యమంత్రికి మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఆలయ అధికారులు స్వాగతం పలకారు.

అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతించారు. అనంతరం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకుని ఆలయంలో వేద మంత్రోచ్ఛారణల మధ్య పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. అర్చకులు సీఎంకు వేద ఆశీర్వచనం అందించారు.