సీఎం రేవంత్ రెడ్డిని కలిసి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ !

👉సీఎంతో యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దర్శించుకున్న ధర్మపురి ఎమ్మెల్యే !


J.SURENDER KUMAR,


ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదినం సందర్భంగా శుక్రవారం యాదగిరి గుట్టు శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ సన్నిధిలో సీఎం రేవంత్ రెడ్డిని ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మర్యాద పూర్వకంగా కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

అనంతరం ముఖ్యమంత్రి మరియు పలువురు మంత్రులతో కలిసి యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.


👉ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో..


ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి జన్మదినం సందర్భంగా శుక్రవారం ధర్మపురి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్మపురి శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారి దేవాలయంలో రేవంత్ రెడ్డి పేరున అర్చన మరియు ప్రత్యేక పూజలను మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు.


అనంతరం స్థానిక నంది విగ్రహం వద్ద మండల నాయకులతో కలిసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు.


👉ఆర్థిక సహాయం…


రేవంత్ రెడ్డి జన్మదినం సందర్భంగా ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆదేశానుసారం కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు NRI ( రామడుగు శివకుమార్ )ల సహకారంతో ధర్మపురి పట్టణానికి చెందిన రెండు నిరుపేద కుటుంబాలైన ఉత్తెం రమేష్ సోదరి వివాహానికి ₹15 వేల మరియు వీరవేని మమత వివాహానికి ₹10వేల రూపాయలు అదే విధంగా మండలం లోని కమలపూర్ గ్రామానికి చెందిన లింగంపల్లి గంగాధర్ ఇటీవల మృతి చెందగా వారి కుటుంబానికి ₹10 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు.


ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.