👉ఈనెల 28, 29 రెండు రోజులపాటు..
👉శ్రీ విఖనస సుధర్మా సేవా సమితి ఆధ్వర్యంలో..
J. SURENDER KUMAR,
ప్రముఖ పుణ్యక్షేత్రమైన ధర్మపురిలో శ్రీ
శ్రీ సర్వ కామప్రద సుదర్శన సహిత లక్ష్మీ నరసింహ యాగము జరగనున్నది. ఈనెల 28 29 తేదీలలో శ్రీ సుధర్మా సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు.
ఎంతో విశిష్టతతో కూడిన 64 వ యాగము సందర్భంగా 108 యాగాల్లో భాగంగా 32వ సంఖ్య నరసింహ స్వామి కి చాలా ప్రీతికరం. మన యాగములలో 32 సంఖ్య పూర్తిచేసి మరో 32 కివచ్చాము అంటే 64 వ యాగమునకు విశేషముగా 32 రకముల ప్రసాదాలు 32 లీటర్లు పాలు, పెరుగు, తేనె, పసుపు, గంధములతో అభిషేకం నిర్వహించినట్టు నిర్వాహకులు తెలిపారు.

పరమ పవిత్రమైన ధర్మపురి క్షేత్రంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి మరియు శ్రీ ఉగ్ర యోగానంద నారసింహ స్వామి వారి దేవస్థాన ప్రాంగణ సమీపాన పవిత్ర గోదావరి పరివాహక ప్రాంతమున నిర్మితమై ఉన్న విశాల బ్రాహ్మణ సత్రము నందు పవిత్ర కార్తీక మాస పర్వదినములలో ఈ నెల 28 మరియు స్వాతి నక్షత్రంతో కూడుకొని ఉన్న 29 వరకు జరుగును.
ఈ కార్యక్రమం నవంబర్ 28 న (గురువారము) ఉదయం 6-00 గంటల నుండి వాస్తు హోమం నరసింహా మూల మంత్ర జపం , శ్రీలక్ష్మీ నరసింహ స్వామివారికి అభిషేకం జరుగుతుంది. సాయంత్రం అంకురార్పణం తో మొదలు పెట్టి * 29 న (శుక్రవారం) మధ్యాహ్నం పూర్ణాహుతితో ముగించబడును.
కావున భక్తులందరూ పై కార్యక్రమంలో సకుటుంబముగా పాల్గొని స్వామివారి కృపా కటాక్షములు పొందవలసిందిగా
శ్రీ విఖనస సుథర్మా సేవా సమితి ప్రకటనలో పేర్కొన్న రు.
👉 అన్నదానం..
ఇట్టి భగవత్ కార్యములో భాగంగా మా మాతృశ్రీ కస్తూరి కమల కోరిక మేరకు శుక్రవారం 29 న మా కస్తూరి కాశయ్య మాస్టారు జ్ఞాపకార్థం అన్న దాన ప్రసాద నిర్వహించనున్నట్టు ప్రముఖ గుండె వైద్య నిపుణుడు, డాక్టర్ శ్రీధర్ కస్తూరి ప్రకటనలో పేర్కొన్నారు.