ధర్మపురి ఆలయం దారి పై నడక నరకమే !

J.SURENDER KUMAR,

ప్రముఖ పుణ్యక్షేత్రం ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి

ఆలయం దారి పై స్థానికులు,

భక్తజనం నడక నరకప్రాయం గా మారింది.


వివరాల్లోకి వెళితే..

స్వామివారి దర్శనార్థం నిత్యం వేలాది మంది భక్తజనం రాకతో ఆలయం, ఆలయ ప్రాంగణం కిక్కిరిసిపోతుంది. ఆలయం ముందు భక్తుల వాహనాల పార్కింగ్ తో శివాలయానికి, బ్రాహ్మణ సంఘం, ఆ ప్రాంతంలో ఉన్న స్థానికుల నివాసాలకు, వారి వాహనాలలో కనీసం ద్విచక్ర వాహనాలపై కానీ, కాలినడకన భక్తులు ఆ ప్రాంతంలో నడవలేని దుస్థితి. ఏదైనా సంభవిస్తే అంబులెన్స్ సైతం వెళ్లలేని పరిస్థితి ..

ఆ ప్రాంతం నివాసస్థులు వాహనాలు సైతం తమ ఇంటి నుండి బయటికి రాలేని దుస్థితి. దీనికి తోడు భక్తుల వాహనాలు వారి నివాస గృహాల ముందు పార్కింగ్ చేయడంతో వారి నడక నరకమే !

👉ఇసుక స్తంభం నుంచి శివాలయం వరకు
నడిరోడ్డు పైనే దుకాణాలు !

ఆలయ ముందు పరిసరాల్లో పూజా సామాగ్రి, కొబ్బరికాయలు, బొమ్మలు విక్రయించే దుకాణదారుల మధ్య వ్యాపార పోటీతో తాము విక్రయించే వస్తువులను ఇరువైపుల దుకాణదారులు తమ దుకాణాల ముందు రోడ్డును అక్రమించి పెట్టడంతో స్థానికులు భక్తులు అవస్థలు పడుతున్నారు. ప్రత్యేకంగా కార్తీక మాసంలో భక్తులు అయ్యప్ప స్వాములతో క్షేత్రం పోటెత్తుతుంది.

👉ప్రమాదాలు జరుగుతే బాధ్యులు ఎవరు ?

స్వామి దర్శనానికి వచ్చే భక్తులు ఆలయ పరిసర దుకాణాలలో పిల్లాపాపలతో కలసి కొనుగోలు చేసే సందర్భంలో ద్విచక్ర వాహనాలు, వాహనాలు రాకపోకలు అగుపించని దుస్థితి అక్కడ. ఈ సందర్భంగా ఏదైనా రోడ్డు ప్రమాదం జరిగితే బాధ్యులు ఎవరు ? స్థానిక మున్సిపల్ అధికారులా ? పోలీస్ యంత్రాంగమా ? ఆలయ అధికారులా ? అనేది చర్చ.

👉గోదావరి నది తీరంలో వాహనలు !

పవిత్ర గోదావరి నది స్నానాలు చేయడానికి తరలివచ్చే భక్తజనం తమ వాహనాలను నది తీరం లో పార్కింగ్ చేయడంతో భక్తులు స్నానాలకు అవస్థలు పడుతున్నారు. మంగలిగడ్డ పై పూజా సామాగ్రి విక్రయించే చిన్న చిన్న దుకాణదారులు వ్యాపార పోటీతో కొబ్బరికాయలు, పూజా ,సామాగ్రి దారికి అడ్డుగా పెట్టడంతో భక్తుల అవస్థలు వర్ణనాతీతం.


గోదావరి నది తీరం, ఆలయ పరిసర రహదారిపై ట్రాఫిక్ నియంత్రణకు ప్రభుత్వ యంత్రాంగం చర్యలు చేపట్టకపోవడానికి కారణమేమిటో ? అంతు పట్టని చిదంబర రహస్యం!