ధర్మపురి నియోజకవర్గానికి గురుకుల పాఠశాల మంజూరు !

👉ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ చొరవతో..


J.SURENDER KUMAR,


ధర్మపురి నియోజకవర్గానికి ప్రభుత్వం సమీకృత గురుకుల పాఠశాల మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, సమీకృత గురుకుల పాఠశాల, కేంద్రీయ విద్యాలయం, ( నవోదయ పాఠశాల ) పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటు కోసం గత కొన్ని నెలల క్రితం సీఎం రేవంత్ రెడ్డి ని కలిసి కోరారు.

సానుకూలంగా స్పందించిన సీఎం రెండవ విడత నియోజకవర్గాలకు మంజూరు చేసిన 26 సమీకృత గురుకుల యంగ్ ఇండియా సమీకృత గురుకుల పాఠశాలల సముదాయాల (ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కాంప్లెక్స్) ను ప్రభుత్వం మంజూరు చేసింది.

ఫైల్ ఫోటో.


ధర్మపురి పట్టణ శివారులో ప్రభుత్వ యంత్రాంగం దాదాపు 30 ఎకరాల స్థలాన్ని సేకరించి సమీకృత గురుకుల పాఠశాలకు కేటాయించడానికి సిద్ధం చేశారు. విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బి. వెంకటేశం శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. సమీకృత గురుకుల పాఠశాల మంజూరు చేయించిన స్థానిక ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ కు విద్యార్థి లోకం విద్యావేత్తలు కృతజ్ఞతలు తెలిపారు.