👉 హైకోర్టు విచారణ అంశం ఏజెండా లో ఎందుకు పెట్టారు ?
👉 జిల్లా సహకార శాఖ అధికారి ఆగ్రహం !
👉’ ఉప్పు ‘ కథనం ఎఫెక్ట్
J.SURENDER KUMAR,
బుధవారం జరగాల్సిన ధర్మపురి ప్రాథమిక వ్యవసాయ
సహకార పరపతి సంఘం సర్వసభ్య సమావేశం జిల్లా
సహకార శాఖ అధికారి ఆదేశాలతో
ధర్మపురి సింగిల్ విండో అధికారులు రద్దు చేశారు.
గౌరవ హైకోర్టు పరిధిలో ఉన్న ధర్మపురి సింగిల్ విండో పాలకవర్గ డిస్ క్వాలిఫికేషన్, నిధుల దుర్వినియోగం, సస్పెన్షన్ అంశాలపై ప్రభుత్వం జారీచేసిన షోకాజ్ నోటీస్ లో అంశాలు సర్వసభ్య సమావేశం ఏజెండాలో ఎలా చేస్తారు ? ఆని అధికారి ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం.
దీంతో ధర్మపురి విండో అధికార యంత్రాంగం ” ఈనెల 6న నిర్వహించనున్న సర్వసభ్య సమావేశం రద్దు ” అంటూ కార్యాలయ నోటీసు బోర్డు పై రద్దు నోటీస్ ను ప్రదర్శించి, ఇదే సమాచారం, ఆయా గ్రామ పంచాయతీలకు సమాచార నిమిత్తం రద్దు ప్రకటన పంపించారు.

రద్దు జరిగినట్టు ప్రచురించిన నోటీసులో ప్రత్యేకంగా షాకాజ్ నోటీస్ లో No . 2251/2024-C. తేది. 25-09-2024 పేర్కొన్నారు. రద్దు నోటీస్ పై నవంబర్ 2 తేదీ ఉంది. మంగళవారం విండో కార్యాలయంలో ఈ నోటీసు రైతులకు అగుపించింది.

” హైకోర్టులో సమస్య – సర్దుబాటుకు యత్నం ?” శీర్షికన మంగళవారం ఉప్పు లో వార్త ప్రచురితమైన విషయం తెలిసిందే.