దీపం వెలిగించినా సంరక్షించిన ముక్తి నిస్తుంది సీఎం రేవంత్ రెడ్డి !

J.SURENDER KUMAR,


“ఒక్క దీపాన్ని వెలిగించినా, ఒక్క దీపాన్ని సంరక్షించినా అది మనకు ముక్తిని కలిగిస్తుంది. సమాజానికి మేలు జరుగుతుందని వేదపండితులు బోధిస్తున్నారు. అలాంటిది కోటి దీపోత్సవ కార్యక్రమం నిర్వహించడం అభినందనీయం” అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.

శుక్రవారం కార్తీక పూర్ణిమ శుభవేళ రేవంత్ రెడ్డి సతీసమేతంగా ఎన్ టీవీ, భక్తి టీవీ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహిస్తున్న కోటి దీపోత్సవంలో పాల్గొన్నారు

.
👉ఈ కార్యక్రమ స్పూర్తిగా రాష్ట్రంలోని అన్ని దేవాలయాల్లో దీపోత్సవం జరుగుతుందని సీఎం చెప్పారు. కోటి దీపోత్సవం నిర్వహించి దాని గొప్పతనాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన యాజమాన్యాన్ని అభినందించారు.


👉ఆనాటి త్రిలింగ క్షేత్రమే ఈనాటి తెలంగాణ రాష్ట్రం. ఇది శైవ క్షేత్రం. వేయి స్తంభాల గుడి, రాజన్న దేవాలయం, అలంపూర్ క్షేత్రం, మల్లికార్జున దేవాలయం ఈ త్రిలింగ దేశంలో నలువైపులా శివ భక్తులు ఉన్నారని, వారితో ప్రపంచమంతా వీక్షించేలా దీపోత్సవం నిర్వహించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.


👉ఈ కార్యక్రమానికి శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి వారిని ఆహ్వానించి భక్తకోటిని అందర్నీ వారిచేత ఆశీర్వదింప జేసినందుకు తెలంగాణ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు.


👉అంతకుముందు సీఎం మహాకాళేశ్వరునికి కోటి పుష్పార్చనలో పాల్గొని అగ్నిలింగ క్షేత్రం తిరువణ్ణామలై శ్రీ అరుణాచలేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించారు.


👉వేదికపై స్వర్ణలింగానికి రజిత బిల్వార్చన, అష్టోత్తరశత స్వర్ణపుష్పార్చన నిర్వహణ అనంతరం అవధూత దత్తపీఠం (మైసూరు) పూజ్యశ్రీ గణపతి సచ్చిదానంద స్వామి వారి ఆశీర్వచనాలను తీసుకున్నారు. తర్వాత జ్వాలతోరణ మహోత్సవంలో పాల్గొనడంతో పాటు గణపతి సచ్చిదానంద స్వామి వారితో కలిసి వేదికపై కార్తీక దీపారాధన చేశారు.