దీపం వెలిగించడం మన సాంప్రదాయం !

J.SURENDER KUMAR,


పవిత్ర కార్తీక మాసంలో నది స్నానం ఆచరించడం దేవాలయ దర్శనం చేసుకుని దీపం వెలిగించడం మన సంప్రదాయం అని జగిత్యాల జిల్లా పూర్వ సంఘ ప్రచారకులుగా కొరివింజ రామచంద్రయ్య అన్నారు.


ప్రముఖ పుణ్యక్షేత్రమైన ధర్మపురి లోని టీటీడీ కల్యాణ మండపంలో సంఘ పరివార క్షేత్రాల కుటుంబ ఆత్మీయ సమ్మేళనం గురువారం జరిగింది. కొరివింజ రామచంద్రయ్య , ఆకారం కేశవరాజు క్షేత్ర సందర్శన సందర్భంగా సమ్మేళనం జరిగింది .


జగిత్యాల జిల్లాలోని అన్ని పరివార క్షేత్రాల కార్యకర్తలను ఒకే వేదికపై కలవడమే ఈ సమ్మేళన ఉద్దేశం అని నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా రామచంద్రయ్య మాట్లాడుతూ ఈమధ్య హిందూ సమాజంలో వచ్చిన వికృత పోకడలను జడ్యాన్ని వదిలివేయాలని ఆచరణాత్మక హిందువుగా జీవించాలని సూచించారు.

మతమార్పిల్లను లవ్ జిహాదీయులను అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. ఆకారం కేశవరాజు మాట్లాడుతూ మహమ్మదీయుల చేత ధ్వంసం చేయబడ్డ దేశంలోని ప్రతి దేవాలయాన్ని పునర్నిర్మించుకోవాలని ధర్మపురి దేవాలయాన్ని కూడా అందులో చేర్చి ఆ విధంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.


సమ్మేళనంలో బూర్ల దక్షిణామూర్తి, రంజిత్ మోహన్, గౌడ జనార్ధన్, గౌడ రమా జనార్ధన్, భూమయ్య, ఆర్ఎస్ఎస్, విశ్వహిందూ పరిషత్, ఏబీవీపీ, భాజాపా కార్యకర్తలు పాల్గొన్నారు.