J.SURENDER KUMAR,
వరి ధాన్యం కొనుగోలు సాఫీగా కొనసాగే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని, రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని, ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
బుగ్గారం మండలం వెల్గొండ, యశ్వంతరావు పేట గ్రామలలో DCMS ఆద్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని అధికారులు,మండల నాయకులతో కలిసి సోమవారం వారం ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..
రాష్ట్ర ప్రభుత్వం కూడా సన్న రకం వడ్లకు ఐదు వందల రూపాయల బొనస్ కూడా ఇవ్వడం జరుగుతుందని, వరి ధాన్యం కొనుగోలు విషయంలో ఎక్కడ సమస్య ఉన్న నా దృష్టికి తీసుకురావాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు,అధికారులు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
👉చెరువు పరిశీలన…

అనంతరం గ్రామంలోని ప్యాటా చెరువును ఇరిగేషన్ అధికారులు మరియు మండల నాయకులతో పరిశీలించారు, ఈ సందర్భంగా ధర్మపురి మరియు బుగ్గారం మండలాలకు ఈ చెరువు నుండి సాగు నీరు అందించవచ్చని, చెరువులో పూడికతీత మరియు ఇతర మరమ్మతులు పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు,అధికారులు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు