👉జగిత్యాల జిల్లా కేంద్రంలో..
J.SURENDER KUMAR,
అనారోగ్య బాధితులకు వ్యాధి నిర్ధారణకు, మెరుగైన సత్వర వైద్య చికిత్సకు ప్రైవేట్ డయాగ్నొస్టిక్ సెంటర్ (ల్యాబ్ ల) నివేదికలే కీలకం అనే విషయం తెలిసిందే. అయితే అర్హతలు లేని టెక్నీషియన్లు, నిబంధనలకు తూట్లు పొడుస్తూ, తనిఖీ అధికారులకు మామూళ్లు ఇస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. నిబంధనలను పాటించని ల్యాబ్ లు ఇచ్చే రక్త మూత్ర తదితర పరీక్షల నివేదికలతో బాధితులకు ఆరోగ్యం చేకూరుస్తుందా ? లేక అనారోగ్యం ముదురుతుందా ? అనే విషయం జగిత్యాల జిల్లా వైద్యశాఖ అధికారులే నిర్ధారించాల్సి ఉంది.
👉 వివరాల్లోకి వెళితే..
జిల్లా కేంద్రంలో నిబంధనలు పాటించని కొన్ని ల్యాబ్‌లు..ప్రైవేటు ఆసుపత్రులకు అనుబంధంగా ల్యాబ్‌లు, నిర్వహిస్తున్నారు. అయితే సంబంధిత ల్యాబ్‌ల్లో అర్హత గల ల్యాబ్ టెక్నిషియన్, పాథలజిస్టులను, స్థానంలో అనర్హత గల వ్యక్తులే ల్యాబ్ పరీక్షలు చేస్తుండడం, వాటి నివేదికలు వ్యాధిగ్రస్తులకు ఇవ్వడంతో నివేదికల ఆధారంగా వైద్యులు రోగనిర్ధారణ చేస్తున్నారని ఆరోపణలు జోరుగా ఉన్నాయి.
👉 రోగనిర్ధారణ పరీక్షలు..
రోగనిర్ధారణ రక్త , మూత్ర తదితర పరీక్షలు అనేది వ్యాధులు, లేదా నిర్ధారణలో వైద్యుడు అందించే చికిత్సకు సహకరించడానికి ల్యాబ్ లో పరీక్షించి నిర్ధారించే నివేదికలు.
వీటితోపాటు ప్రయోగశాల సెట్టింగ్‌లలో ఉపయోగించే సాధనాల్లో ఇమేజింగ్ యంత్రాలు ( ఎక్స్-రే, MRI ), లేబొరేటరీ ఎనలైజర్‌లు ( బ్లడ్ కెమిస్ట్రీ, హెమటాలజీ ), డయాగ్నస్టిక్ కిట్‌లు (రాపిడ్ టెస్ట్‌లు, ఇమ్యునోఅసేస్), జన్యు పరీక్ష పరికరాలు మరియు ఇతర ప్రత్యేక పరికరాలు వంటి విస్తృత శ్రేణి పరికరాలు ఉంటాయి. రోగనిర్ధారణ పరీక్ష సాధనాలు ఆరోగ్య సంరక్షణ నిపుణులు రోగి ఆరోగ్యం గురించి ఆబ్జెక్టివ్ డేటాను సేకరించడంలో, గుర్తించడంలో మరియు ఖచ్చితమైన రోగ నిర్ధారణ చేయడంలో ఈ సాధనాలు ఉపయోగపడతాయి. ముందస్తుగా వ్యాధిని గుర్తించడం, చికిత్స ప్రతిస్పందనను పర్యవేక్షించడం రోగి సంరక్షణకు మార్గనిర్దేశం చేయడం ద్వారా ఆధునిక వైద్యంలో ఇవి కీలక పాత్ర నిర్వహిస్తున్నాయనేది వాస్తవం.
👉 రిజిస్టర్ అయి ఉండాలి…
తెలంగాణ స్టేట్ క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ (రిజిస్ట్రేషన్లు & రెగ్యులేషన్) రూల్స్, 2011 గా ఆమోదించిన చట్టం ప్రకారం, ప్రైవేట్ ఆస్పత్రులు, అన్ని రకాల ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలు ల్యాబ్ పరికరాలు డిస్ట్రిక్ట్ రిజిస్టరింగ్ అథారిటీ లో తప్పనిసరి రిజిస్టర్ అయి ఉండాలి. డయాగ్నస్టిక్ లాబొరేటరీలు, ఫిజియోథెరపీ యూనిట్లు, CT మరియు MRI స్కాన్ ల్యాబ్‌లు నమోదు చేసుకోవాలి. అయితే వీటి వివరాలు అధికారికా రికార్డులు పరిశీలిస్తే వాస్తవాలు వెలుగు చూస్తాయి.
👉 డయాగ్నొస్టిక్ కేంద్రాల నిబంధనలు !
NABL (నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ కాలిబ్రేషన్ లాబొరేటరీస్) అక్రిడిటేషన్ పొందాలి, క్లినికల్ పని నిర్వహించే ప్రయోగశాల ల కోసం అక్రిడిటేషన్ బాడీ ఇది. భారత ప్రభుత్వంలోని సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం కింద పనిచేసే స్వయం ప్రతిపత్తి సంస్థ. నాణ్యత, వ్యర్థాల, బయో హాజార్డ్ నిర్వహణ మరియు డేటా రక్షణకు సంబంధించిన నిబంధనలకు అనుగుణంగా పరీక్షా కేంద్రాల్లో ఉండాలి .
👉 ల్యాబ్ టెక్నీషియన్లకు అర్హతలు !

ల్యాబ్ లో పరీక్ష నిర్వహించేవారు Bsc,లొ బోటనీ జువాలజీ కెమిస్ట్రీ, లేదా మైక్రో బయాలజీ జెనెటిక్స్ కెమిస్ట్రీ, యూనివర్సిటీ గుర్తింపు పొందిన డిగ్రీ కలిగి ఉండాలి.
డిప్లొమా ఇన్ మెడికల్ లేబోరేటరీ టెక్నీషియన్ (DMLT), సర్టిఫికెట్ , ప్రోగ్రాం ఇన్ ల్యాబ్ టెక్నీషియన్, ప్రభుత్వ గుర్తింపు పారామెడికల్ వైద్య సంస్థల నుండి కనీస అర్హతలు వీరు కలిగి ఉండాలి.
👉 ఇష్టారాజ్యంగా ల్యాబ్ పరీక్ష ఫీజులు !
ల్యాబ్ పరీక్షల కోసం నిర్వాహకులు ఇష్టారీతిగా ఫీజులు వసూలు చేస్తూ ఎలాంటి రసీదులు ఇవ్వకుండా డిమాండ్ చేసిన వారికి కాగితంపై ఇస్తున్నారు అనే ఆరోపణలున్నాయి.
👉 రాష్ట్రంలో గుర్తింపు పొందిన ప్రముఖ డయాగ్నొస్టిక్ సెంటర్ లలో పరీక్షల ఫీజుల వివరాలు కొన్ని ప్రజలకు అందుబాటులో ఉంచారు.!
సి బి టి ₹ 390/- Hb A1C ₹ 580/- థైరాడ్ ₹ 650/- లిప్పుడ్ ప్రొఫైల్, ₹ 680/-. కంప్లీట్ యూరిన్ ఎగ్జామిన్ ₹ 270/-. లివర్ ఫంక్షన్ టెస్ట్ (LFT -A ) ₹ 680/- ఈసీజీ ₹ 320/- ఈఎస్ఆర్ ₹ 220/- అల్ట్రా సౌండ్ అబ్డామిన్ అండ్ పిలియూస్ ₹ 1350/- రాండమ్ ప్లాస్మా గ్లూకోస్.₹ 220/- సీఆర్పీ ₹ 480/- విటమిన్ బి 12.₹ 1350/- తదితర పరీక్షల ఫీజులు ఆయా ల్యాబ్ ల లో ని బోర్డులపై నమోదు చేసి ఉంచుతారు. ప్రముఖ డయాగ్నొస్టిక్ సెంటర్ లు కొన్ని తమ తమ వెబ్ సైట్ ల అందుబాటులో ఉంచుతారు.
జగిత్యాల జిల్లా కేంద్రంలో ఇలాంటి ధరల వివరాలు కొన్ని ల్యాబ్ లలో కనుచూపు మేరలో అగుపించవు. నిబంధనలకు తూట్లు పొడుస్తున్న కొన్ని డయాగ్నొస్టిక్ సెంటర్ ల తీరుపై సంబంధిత శాఖ అధికార యంత్రాంగం ఏం చేస్తుందో వేచి చూడాల్సిందే..