డాక్టర్‌ కావడం అనేది సామాన్యం కాదు కలెక్టర్ సత్యప్రసాద్ !

J.SURENDER KUMAR,


డాక్టర్‌ కావడం అనేది సామాన్యం కాదు ఎంతో కృషి, పట్టుదల ఉంటే కానీ వైద్య వృత్తి లక్ష్యాన్ని సాధించలేరని డాక్టర్ ప్రాముఖ్యతను జగిత్యాల జిల్లా కలెక్టర్ బి . సత్య ప్రసాద్ అన్నారు.

సోమవారం స్థానిక మెడికల్ కాలేజీలో MBBS 2024 బ్యాచ్ స్టూడెంట్స్ కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరైనారు. ఈ సందర్భంగా కలెక్టర్ ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

కలెక్టర్ మాట్లాడుతూ
అదే విధంగా వైద్యులుగా మారిన తర్వాత వైద్య సేవలు అందించాలంటే ముందుగా నిస్సహాయత, మానవతా దృక్పథం యొక్క విలువలు తెలుసుకోవాలని కలెక్టర్ అన్నారు


అనంతరం ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు గోల్డ్ మెడల్స్ , ఎక్సలెన్స్ సర్టిఫికెట్లను కలెక్టర్ ప్రధానం చేశారు.
ముందుగా ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డా.SSS ఖాద్రి మాట్లాడుతూ కళాశాల సౌకర్యాలను వివరించి విద్యార్థుల ప్రతిభను గురించి కొనియాడారు.


ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ డాక్టర్ రాములు, వైద్యాధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.