👉 కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం – కోర్టు ఆవరణలో రైతులు !
👉ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రైతుల విజ్ఞప్తి..
J.SURENDER KUMAR,
గత బీఆర్ఎస్ ప్రభుత్వం మాపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని రైతు నాయకులు విజ్ఞప్తి చేస్తున్నారు.
గత ప్రభుత్వం రైతన్నలపై పెట్టిన కేసులు భాగంలో వరి ధాన్యం, పాడి పశువులు, వ్యవసాయ పనులు, అన్ని వదిలి కోర్టు చుట్టూ తిరుగుతున్నామన్నారు.
బుధవారం జగిత్యాల కోర్ట్ ఆవరణలో వారు డిమాండ్ చేశారు. ఇది ప్రభుత్వానికి మంచిది కాదని అన్నారు, రైతు శ్రేయస్సు కోరే ఈ ప్రజా పాలన ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతన్నల పై పెట్టిన అక్రమ కేసుల పై పరిశీలించి మా పై కనికరించి పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయాలని వారు ప్రభుత్వానికి మొరపెట్టుకున్నారు .
ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ వరి ధాన్యం కల్లాలలో ఉన్న సమయంలో వర్షం పడితే ఆరుగాలం పండించిన పంట భూమి పాలు అవుతుందని, వ్యవసాయ క్షేత్రంలో రైతు కూలీలను, పనులను వదిలి తాము కోర్టు చుట్టూ తిరగడంతో అనేక ఇబ్బందులు పడుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. .
జిల్లా రైతు నాయకులు పన్నాల తిరుపతిరెడ్డి, ఎం .రామ్ రెడ్డి, కాటిపెళ్లి గంగారెడ్డి , ఐలేని సాగర్ రావు, నేరెళ్ల భూమ రెడ్డి, బి మల్లయ్య, తీపి రెడ్డి రత్నాకర్ రెడ్డి, ఐలేని విక్రమ్ రెడ్డి, గోలి జనార్దన్ రెడ్డి, నోముల రాజగోపాల్ రెడ్డి ,మందల గోపాల్ రెడ్డి, శ్యాంసుందర్ రెడ్డి లు ప్రభుత్వానికి మొరపెట్టుకున్నారు.