J.SURENDER KUMAR,
జిల్లా కేంద్రంలోని క్లబ్ లో SGF ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థాయి అండర్ -14,అండర్ – 17 టేబుల్ టెన్నిస్ పోటీలు జరిగాయి.
శుక్రవారం జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జగిత్యాల డిఎస్పీ రఘుచందర్ ఆ సరే విజేతలకు బహుమతులు అందజేశారు.
ఈ సందర్భంగా డిఎస్పి మాట్లాడుతూ విద్యార్థిని విద్యార్థులు గెలుపోటములను సమానంగా తీసుకోవాలని ఈ రోజు ఓడిన వారు బాధ పడకుండా మున్ముందు జరిగే పోటీల్లో గెలుపొందే విధంగా శిక్షణ పొందాలని అలాగే గెలుపొందిన విద్యార్థులు రాష్ట్ర స్థాయి లోనే కాకుండా జాతీయ స్థాయిలో జగిత్యాల జిల్లాకు పేరు తేవాలని అన్నారు, గెలుపొందిన విద్యార్థులకు పథకాలను అందజేశారు.

ఈ కార్యక్రమంలో ఎస్ జి ఎఫ్ జిల్లా కార్యదర్శి రాం నాయక్, సీనియర్ జర్నలిస్ట్ రంగారావు, పెటా జిల్లా అధ్యక్షులు పడాల విశ్వ ప్రసాద్, కార్యక్రమ నిర్వాహకులు మర్రిపెల్లి శ్రీనివాస్, పి డి & పి ఈ టి లు శ్రీనివాస్, సాగర్, కోటేశ్వర్, జామున రాణి, విజయ, పోడేటి శ్రీకాంత్, సత్యనారాయణ, భాణేష్, మహేష్, నరేష్, గౌతమ్, మని తదితరులు పాల్గొన్నారు.