👉 గోదావరి నది హారతి కార్యక్రమంలో..
👉 ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ !
J.SURENDER KUMAR,
పవిత్ర గోదావరి నది మాత ఆశీస్సులు ఎల్లవేళలా నా నియోజకవర్గం పై ఉండి రైతాంగం ప్రజలు సాగు తాగునీటి ఇబ్బందులు లేకుండా కరుణించాలని ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ అన్నారు.

కార్తీక మాసంలో ధర్మపురి క్షేత్రం గోదావరి నదికి నిర్వహించే మహా హారతి కార్యక్రమం శనివారం ఆరంభమైంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ..

పవిత్ర హారతి కార్యక్రమంలో. పాల్గొనడం తన అదృష్టం అన్నారు. గోదావరి మాత ఆశీస్సులు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి కృప కటాక్షాలు ఈ ప్రాంత ప్రజలతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు ఈ సందర్భంగా అన్నారు.
