👉అధికారం దూరం కావడాన్ని తట్టుకోలేకే తప్పుడు ఆరోపణలు!
👉గ్రామ పంచాయతీ భవనం తాకట్టు ట్వీట్ పై మంత్రి సీతక్క ఫైర్ !
J.SURENDER KUMAR,
జగిత్యాల జిల్లా తొంబరావుపేట గ్రామంలో గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి సంబంధించి ₹ 17 లక్షల బిల్లులు పెండింగ్లో ఉన్నట్లుగా ఒక పత్రికలో కథనం రావటం..దాన్ని కనీసం చెక్ చేసుకోకుండానే మాజీ మంత్రి హరీష్ రావు ట్వీట్ చేయడం పట్ల పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ @ సీతక్క తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు.
👉నిత్యం మీడియా, సోషల్ మీడియాలో ఉండేందుకు పాకులాడుతూ..తప్పుడు ప్రచారం చేయడాన్నే హరీష్ రావు పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు.
👉గత నెల 19 నే మాజీ సర్పంచ్ మామిడి సత్తమ్మకు ₹ 7,46,787 చెక్ లకు ఇవ్వగా 23 అక్టోబర్ న మాజీ సర్పంచ్ డబ్బులు విత్ డ్రా చేసుకున్నట్లు అధికారులు మంత్రి సీతక్క దృష్టికి తీసుకొచ్చారు. ఇంకా గ్రామ పంచాయతీ భవన నిర్మాణం పూర్తి కాలేదని… ప్లాస్టరింగ్ పనులు పెండింగ్ లో ఉన్నాయని.. పనులు పూర్తి చేసిన తర్వాత బిల్లులు సమర్పించాలని మాజీ సర్పంచ్ కు అధికారులు సూచించగా..ఇప్పటి వరకు బిల్లులు సమర్పించలేదని జిల్లా అధికారులు మంత్రికి నివేదిక సమర్పించారు.

👉దీనిపై మంత్రి సీతక్క తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. ఓ మీడియాలో వచ్చిన కథనంపై వాస్తవాలు తేలుసుకోకుండా హరీష్ రావు ట్వీట్ చేయడాన్ని మంత్రి సీతక్క తప్పుబట్టారు. లేని అంశాలున్నట్లు భ్రమింప చేయడాన్ని హరీష్ రావు మానుకోవాలని సూచించారు.
👉 అవస్తవాలను ప్రచారం చేసి అధికారంలోకి వచ్చేందుకు హరీష్ ఆరాట పడుతున్నారని మండిపడ్డారు.
👉అయితే సెంటిమెంట్ రాజకీయాలు, లేకపోతే అవస్తవాలు ఇవే హరీష్ రావు నైజామా అని మంత్రి సీతక్క ప్రశ్నించారు.
👉జీపీ భవనానికి సంబంధించి ₹.7,46,787 చెల్లింపులు జరిగాయని..మిగిలిన పనులు పూర్తి కాకుండా మొత్తం బిల్లులు చెల్లించాలా ? అని ప్రశ్నించారు.
👉పదేల్లు మంత్రిగా ఉన్న హరీష్ రావు పనులు కాకుండానే బిల్లులు చెల్లించారా ? అని ఆగ్రహం వ్యక్తం చేసారు.
👉అధికారం దూరం కావడాన్ని హరీష్ రావు తట్టుకోలేకపోతున్నారని..అందుకే ప్రజలకు అన్యాయం జరుగుతున్నట్లుగా లేని పోని ఆరోపణలు చేస్తున్నారని మంత్రి సీతక్క తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు.
👉మీ భాదను ప్రజల భాదగా ప్రచారం చేయోద్దని సూచించారు. గత ప్రభుత్వంలో బిల్లులు చెల్లించక సర్పంచ్ లు ఆత్మహత్యలు చేసుకున్నారని సీతక్క గుర్తు చేసారు.
👉చేసిన పనులకు బిల్లులు తీసుకుని..బిల్లులు రాలేదని తప్పుడు ప్రచారం చేస్తే కేసులు తప్పవని మంత్రి సీతక్క హెచ్చరించారు.