👉 ధర్మపురి సింగిల్ విండో డిస్ క్వాలిఫికేషన్ కు షోకాస్ నోటీస్ జారీ..
👉 న్యాయ నిబంధనలకు తూట్లు..
J.SURENDER KUMAR,
ధర్మపురి ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం పాలకవర్గం డిస్ క్వాలిఫికేషన్ కు షోకాస్ నోటీస్ జారీ అయింది.
పాలకవర్గం హైకోర్టును ఆశ్రయించారు. సమస్య హైకోర్టులో కొనసాగుతున్నది. న్యాయ నిబంధనలకు తూట్లు పొడుస్తూ విండో అధికారులు ఈనెల 6 న సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేస్తూ సర్కులర్ జారీ చేసి సమస్య సర్దుబాటుకు యత్నం చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
👉వివరాలు ఇలా ఉన్నాయి..
ధర్మపురి సింగిల్ విండో లో ₹ 1 , 24, 30, 688. ( కోటి ఇరువది నాలుగు లక్షల ముప్పది వేల ఆరువందల ఎనుబై యెనిమిది ) నిధులు దుర్వినియోగం పై పాలక కార్యవర్గం పై ఎందుకు అనార్హత వేటు వేయకూడదో ? వారం రోజులలో వివరణ ఇవ్వాలని జగిత్యాల జిల్లా సహకార అధికారి మనోజ్ కుమార్ ధర్మపురి సింగిల్ విండో పాలకవర్గానికి, అధికారులకు, R.C No . 2251/2024-C. తేది. 25-09-2024 న షోకాస్ నోటీస్ జారీ చేశారు.

ఈ నోటీసు పై ధర్మపురి సింగిల్ విండో పాలకవర్గం హైకోర్టును ఆశ్రయించింది W.P.NO. 27755 OF 2024. ఫైల్ చేశారు. ప్రస్తుతం ఈ అంశం అత్యున్నత గౌరవ హైకోర్టులో కొనసాగుతున్నది.
👉 షోకాస్ నోటీస్ లో అంశాలు ఎజెండాలో చేర్చడం ఎందుకో ?

సింగిల్ విండో వ్యవహారాలపై తనిఖీ చేసి ప్రభుత్వానికి సమర్పించిన నివేదికపై ( తనిఖీ అధికారుల పేర్లు పేర్కొంటూ ) చర్చ తో పాటు అభిప్రాయం గూర్చి.. పాలకవర్గం డిస్ క్వాలిఫికేషన్, కార్యదర్శి సస్పెన్షన్, 2023-2024 ఆడిట్ నివేదిక ఆడిట్ సర్టిఫికెట్ ఆమోదం సర్వసభ్య సమావేశం ఎజెండాలో ప్రధాన అంశాలు పేర్కొన్నారు.
భూమి కొనుగోలు, ఎలక్ట్రానిక్ తూకం యంత్రాలు, ఫర్నిచర్, గోదాముల నిర్మాణలు, ప్లాస్టిక్ కవర్లు, గన్ని బ్యాగులు, వరి ధాన్యం కొనుగోలు కమిషన్, తదితర అనేక అంశాలలో నిధులు గోల్ మాల్ జరిగినట్టు ఆ శాఖ ప్రత్యేక విచారణ అధికారులు బి ఆంజనేయులు అసిస్టెంట్ రిజిస్టార్, కే జోషి జూనియర్ ఇన్స్పెక్టర్ తమ విచారణ తనిఖీ డాక్యుమెంట్లను సెప్టెంబర్ 23 న దాదాపు 300 పేజీల నివేదికను ప్రభుత్వానికి సమర్పించినట్టు తెలిసింది.
👉సర్వసభ్య సమావేశంలో అభిప్రాయాలు ఎందుకు ?

హైకోర్టు విచారణలో ఉన్న ధర్మపురి సింగిల్ కార్యవర్గం డిస్ క్వాలిఫికేషన్ ,కార్యదర్శి సస్పెన్షన్ అంశంల లో చర్చ, అభిప్రాయ సేకరణ అంటూ సర్కులర్ లో పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది.
మమ్మల్ని సంప్రదించి, మౌఖికంగా మా అభిప్రాయాల మేరకే నిధులు వెచ్చించినట్టు సమావేశంలో సభ్యుల తో తీర్మానింపచేయాలని సమావేశ లక్ష్యం అనేది చర్చ.
దీనికి తోడు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కులగన సర్వే ఈనెల 6 న ఆరంభం కానున్నది. మెజార్టీ సభ్యులు ఆయా గ్రామాలలో తమ నివాసాలలో సర్వే సమాచారం ఇవ్వడానికి ఉంటారని, తమ అనుకూలమైన సభ్యులతో. అనుకూలమైన తీర్మానాలు చేయించడం కోసమే ఈ ఎత్తుగడ అనేది చర్చ.
కోర్టులో కొనసాగుతున్న . సమస్యలపై చర్చించడం, అభిప్రాయాలు వ్యక్తం చేయడం కోర్టు నిబంధనలకు విరుద్ధం అనే చర్చ మొదలైంది.
హైకోర్టు పరిధిలో ఉన్న అంశం ను సర్వసభ్య సమావేశం ఎజెండా లో పొందుపరచడంపై
సంబంధిత సహకార శాఖ అధికారులు ఈ అంశంపై ప్రభుత్వానికి నివేదిక అందిస్తారో ? కోర్టు లో వీరిపై న్యాయపరమైన చర్యలు చేపడతారో ? వేచి చూద్దాం..
👉 సింగల్ విండో పై ఫిర్యాదు..

ధర్మపురి సింగిల్ విండో సొసైటీ ద్వారా కమలాపూర్ గ్రామం నుండి వరి ధాన్యం ప్రతి పంటకు 20 వేల క్వింటాల్ కొనుగోలు చేస్తున్న, మాకు లాభాలు, హమాలి కాంట ఖర్చుల డబ్బులు ఇవ్వడం లేదని సట్టంశెట్టి రాజన్న అనే రైతు ఈనెల 1 జిల్లా సహకార శాఖ అధికారికి చేసిన ఫిర్యాదులో పేర్కొన్నాడు .
గతంలో ఇట్టి డబ్బులు రైతుల ఖాతాలో జమ చేసే వారిని, రైతులు తీసుకున్న పంట రుణాలలో సంఘం వాటా దనం తీసుకుని, రైతుల నుండి ప్రతి ఆరు నెలలకు ఒకసారి రెన్యువల్ పేరిట మొత్తంలోనూ సంబంధించిన వడ్డీ వసూలు చేస్తున్నారని ఫిర్యాదులో రైతు పేర్కొన్నాడు.
అట్టి రుణం తిరిగి రైతు చెల్లించిన రైతుల వాటా ధనం వడ్డీ తిరిగి రైతులకు ఇవ్వడం లేదని ఫిర్యాదులో ఆరోపించాడు. గత పది సంవత్సరాలుగా ఇతర సంఘాలలో రైతులకు లాభాలలో వాటా ఇస్తున్నారని ధర్మపురి సంఘంలోని అన్ని గ్రామాల నుండి కొనుగోలు చేసిన వరి ధాన్యం మరియు వాటి లాభాలు, ఖర్చులు, వాటికి సంబంధించిన వివరాలు పరిశీలించి రైతులకు న్యాయం చేయాలని రాజన్న తన ఫిర్యాదు పత్రంలో పేర్కొన్నారు.