హిందూ ముస్లింలు ప్రభుత్వానికి రెండు కళ్ళు సీఎం రేవంత్ రెడ్డి !

J.SURENDER KUMAR,


తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపించడంలో రాష్ట్రంలోని హిందూ ముస్లింలను ప్రభుత్వం రెండు కళ్లలా భావిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  అన్నారు.
విద్య, వైద్యం, ఉపాధి అవకాశాల్లో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి అందరి సహకారం కావాలని కోరారు

.
👉భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని పురస్కరించుకుని సోమవారం రవీంద్రభారతిలో జాతీయ విద్యా దినోత్సవం, మైనారిటీ సంక్షేమ దినోత్సవాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సీఎం  మౌలానా అబుల్ కలాం  చిత్రపటానికి నివాళులు అర్పించారు.


👉అనంతరం సీఎం మాట్లాడుతూ, దేశంలో ఆధునిక విద్యకు మౌలానా అబుల్ కలాం  బలమైన పునాది వేశారని గుర్తుచేశారు. ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ నాయకత్వంలో 11 సంవత్సరాల పాటు విద్యా శాఖ మంత్రిగా పనిచేసిన మౌలానా  దేశానికి అత్యుత్తమ విద్యా విధానాన్ని అందించారని చెప్పారు.


👉హిందూ ముస్లింల మధ్య విభజన రాజకీయాలు దేశానికి నష్టం చేకూర్చుతుందని, అలాంటివి దేశాన్ని బలహీనపరిచే చర్యలుగా వివరించారు. తమ ప్రభుత్వంలో మైనారిటీలకు తగిన ప్రాధాన్యతను ఇస్తున్నామని అందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.


👉తెలంగాణ మైనారిటీస్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ సొసైటీ (TGMREIS) రూపొందించిన ఇంటిగ్రేటెడ్ కమాండ్ సెంటర్‌ను సీఎం ప్రారంభించారు. 2019 నుంచి 2024 వరకు ప్రతి ఏటా అందించే మౌలానా అబుల్ కలాం ఆజాద్ అవార్డులను, మఖ్దూమ్ అవార్డును, 21 మంది ప్రముఖులకు లైఫ్‌టైమ్ అవార్డులను ఈ వేదిక నుంచి సీఎం అందించారు.


ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ , ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ , ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ , ఎమ్మెల్సీ ఆమెర్ అలీ ఖాన్ , మాజీ ఎంపీ వి.హనుమంతరావు  TGMREIS  ప్రెసిడెంట్ ఫహీమ్ ఖురేషీ , తెలంగాణ ఉర్దూ అకాడమీ ప్రెసిడెంట్ తాహెర్ బిన్ అహ్మద్ , ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఫహీం , ఇతర నేతలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.