👉సమ్మేళనంలో గణపతి అథర్వ శీర్ష సహస్ర అభిషేకం !
J.SURENDER KUMAR,
ఈనెల 24న జరగనున్న జంట నగరాలలోని మంథని వాసుల ఆత్మీయ సమ్మేళనం లో గణపతి అథర్వ శీర్ష సహస్ర అభిషేకం నిర్వహించనున్నట్లు సహస్ర అభిషేక సమన్వయ కర్త వినోద్ కుమార్ మహావాది తెలిపారు.

కార్తీక సమారాధన లో భాగంగా సనాతన ధర్మ పరి రక్షణ కోసం, లోక క్షేమం కోసం,ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో భాగంగా గణపతి అథర్వ శీర్ష సహస్ర అభిషేకం నిర్వహించ ఉన్నట్టు ఆయన తెలిపారు.
సైదాబాద్ లోని పద్మావతి కళ్యాణ మండపం లో ఎంతో మంది మంథని బ్రాహ్మణులు వరహాల రవీంద్ర , నిర్వహణలో కార్తీక సమారాధన లో భాగంగా ఆదివారం 9.30 am నుండి గణపతి సహస్ర అభిషేకం నిర్వహిస్తారు.
” సహస్రావర్తనాద్యం యం కామ మధితే తం తమనేన సాధయేత్ ” అని అథర్వణ వాక్యం. అనగా వెయ్యి సార్లు ఎవరైతే గణపతి అథర్వణ శీర్షం చదువుతారో వారు ఏది అనుకుంటే అది సిద్ధిస్తుంది. అని వినోద్ కుమార్ మహారాజు వివరించారు.

ఈ కార్యక్రమంలో సుహాసినీలు లలితా సహస్ర నామ పారాయణం చేస్తారని. దాదాపు ఐదు వందల మంది ఈ సమారాధన లో పాల్గొంటారు. వినోద్ కుమార్ మహావాది వివరించారు
👉 ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం వివరాల కోసం సహస్ర అభిషేక సమన్వయ కర్త 9000013755 ఫోన్ నెంబర్ కు సంపాదించాలని కోరారు.