J.SURENDER KUMAR
ప్రభుత్వ అధికారులు, ప్రజా ప్రతినిధులు కలిసి పని చేసి జిల్లా అభివృద్ధికి కృషి చేద్దామని దిశ చైర్మన్, నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ అన్నారు.
గురువారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ (దిశ) సమావేశం చైర్మన్ ధర్మపురి అరవింద్ అధ్యక్షతన జరిగింది.
జిల్లా కలెక్టర్ బి, సత్య ప్రసాద్ ప్రభుత్వ విప్ ధర్మపురి శాసన సభ్యులు అడ్డూరి లక్ష్మణ్ కుమార్, జగిత్యాల శాసనసభ్యులు సంజయ్ కుమార్ ,అదనపు కలెక్టర్లు బిఎస్ లత, గౌతమ్ రెడ్డి లతో కలిసి చైర్మన్ కేంద్ర ప్రభుత్వం నుండి వివిధ శాఖలకు వచ్చే నిధులకు సంబంధించిన అంశాలపై సమీక్షించారు.

ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ… ప్రజల సమస్యలను పరిష్కరించే దిశగా అధికారులు నిశ్వర్దపరంగా పనిచేస్తన్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం వేలాది కోట్ల రూపాయలను ఇవ్వడం జరుగుతుందని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కేటాయిస్తున్న నిధులను సక్రమంగా వినియోగించుకునే విధంగా చర్యలు తీసుకోవాలని చైర్మన్ సూచించారు. దిశ ప్రాముఖ్యతను గుర్తించి సమావేశంలో ప్రతిపాదించిన, చర్చించిన, పరిష్కార విషయాలను 3 మాసాలకు సమీక్షించుకోవలసిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వం వివిధ శాఖలకు మంజూరు చేసిన నిధుల వివరాలు ఆదేశించారు. స్వచ్చ భారత్ పంచాయితీ రాజ్, ఆర్ అండ్ బి, ఉపాధి హామీ, విద్యుత్ , మిషన్ భగీరథ, జాతీయ రహదారులు,తదితర అంశాలపై సమీక్షించారు.
అనంతరం ముందుగా జిల్లాలోని ఆర్మూర్ మంచిర్యాల NH 63, జగిత్యాల డివిజన్లో కోరుట్ల మెట్పల్లి జరుగుతున్న నాలుగు వరుసల రోడ్డు పనులను త్వరిగతన చెయ్యాలని ఆదేశించారు. పంచాయతీరాజ్ ఈ జి ఎస్ నిధుల కింద జిల్లాలో మంజూరైన రోడ్లు బ్రిడ్జిల్ని దమ్మన్నపేట కాచారం రోడ్డుని పూర్తి చేయాలని తెలిపారు. అమృత పథకం కింద జిల్లాలో మొత్తం జరుగుతున్న ప్రాజెక్టు వివరాలు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ జిల్లాలో పీహెచ్ సెంటర్ 70సబ్ సెంటర్ 150 అధికారులు తెలిపారు .త్వరలో దిశ కమిటీ వేసి సభ్యులను నామినేట్ చేస్తామని చెప్పారు.

రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ ,ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వంలోని FCI ద్వారా జరిగే వడ్ల కొనుగోలు సజావుగా జరిగే విధంగా దృష్టి సారించాలని,జిల్లా అధికారులు మరియు FCI అధికారులు సమన్వయంతో పనిచేయాలని,మిగిలిన ధాన్యం నిల్వలు కూడా రాష్ట్ర ప్రభుత్వ నిబంధనలు మరియు FCI నిబంధనలకు అనుగుణంగా కొనుగోళ్ళు చేపట్టాలని ఈ సందర్భంగా తెలిపారు..
కార్యక్రమంలో, డిఆర్డిఓ ,రఘువరన్, మున్సిపల్ చైర్మన్లు, ఆడువల జ్యోతి, మోరా హనుమాన్లు , వివిధ జిల్లా శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.