జగిత్యాల జిల్లాలో గ్రూప్ – 3 పరీక్షకు 34 పరీక్ష కేంద్రాలు !

👉పరీక్షకు 10656 మంది అభ్యర్థులు హాజరు కాబోతున్నారు.ఇందులో 33 మంది దివ్యాంగులు

👉కలెక్టర్ బి సత్యప్రసాద్.


J.SURENDER KUMAR,


జగిత్యాల జిల్లాలో  17, 18 న  తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా జరగనున్న గ్రూప్ త్రీ పరీక్షకు 34 ఎగ్జామ్స్ సెంటర్లలో  10656 మంది పరీక్షకు హాజరు కాబోతున్నారు ఇందులో 33 మంది అంగవైకల్యం కలిగిన వారు ఉన్నారు ఇట్టి పరీక్షకు సంబంధించి ఏర్పాట్లను జగిత్యాల జిల్లా కలెక్టర్ ఇది సత్యప్రసాద్  వివిధ డిపార్ట్మెంట్లో పూర్తి చేయాలని కోరారు.


34 సెంటర్లలో జగిత్యాల లో 22 సెంటర్లు కోరుట్లలో 8 సెంటర్లు జగిత్యాల రూరల్ మండల్ జాబితాపూర్ లో ఒక సెంటర్, కొండగట్టు జేఎన్టీయూ లో రెండు సెంటర్లు ,రామన్నపేట మల్యాల లో ఒక సెంటర్  ఏర్పాటు చేశారు. దీనికిగాను ఆరు రూట్లలో ఏర్పాటు చేయడం జరిగింది 11 మంది ఫ్లైయింగ్ స్క్వాడ్లను, 13 మంది ఐడెంటిఫికేషన్ ఆఫీసర్లను 82 మంది బయోమెట్రిక్ ఇన్విజిలేటర్లను అపాయింట్ చేయడం జరిగింది అన్నారు. 

34 సెంటర్లలో 34 మంది చీఫ్ సూపర్డెంట్ లో 34 మంది అబ్జర్వర్లు 34 మంది డిపార్ట్మెంటల్ ఆఫీసర్లను అపాయింట్ చేయడం జరిగినది . అపాయింట్ చేసిన వారందరికీ శిక్షణను పూర్తి చేయడం జరిగినది అపాయింట్ చేసిన వారందరికీ ఐడీ కార్డు లేకుండా పరీక్ష కేంద్రాలలో అనుమతి లేదని వారికి ఐడెంటి కార్డులను కూడా జారీ చేయడం జరిగినది అన్నారు.


ప్రతి సెంటర్లో వైద్యాధికారి ని ఫస్ట్ ఎయిడ్ సెంటర్ ఏర్పాటు చేయుటకు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నిరంతర విద్యుత్తు సరఫరా చేయుటకు ఆదేశాలు జారీ చేశారు.  దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లను శుక్రవారం సమీక్షించారు.
పరీక్షకు హాజరు కాబోతున్న అభ్యర్థులకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా జారీ చేయబడిన నియమములను పాటించవలసినదిగా మరియు ఎగ్జామినేషన్ సెంటర్ కి ఒకరోజు ముందుగా వెళ్లి సెంటర్లు చూసుకోవలసినదిగా కోరారు.


తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్  నిర్ణయించిన సమయము ఉదయం పరీక్ష రాసేవారు 8:30 గంటలకు నుండి 9:30 గంటల వరకు లోపలికి అనుమతించబడును. మధ్యాహ్నం పరీక్ష రాసేవారు 1. 30 నుండి 2.30 నిమిషాల వరకు మాత్రమే లోపలికి అనుమతించబడతారు. మరియు అభ్యర్థులు ఎలాంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్,  అనుమతించబడవు అభ్యర్థులు పరీక్ష కేంద్రంలోకి వెళ్లిన వెంటనే బయోమెట్రిక్ కంపల్సరీ నమోదు చేసుకోవాల్సినది గా కోరారు.