👉నేడు తిమ్మాపూర్ లో అంత్యక్రియలు..
J.SURENDER KUMAR,
జువ్వడి సూర్యారావు @ తిమ్మాపూర్ సూరన్న, ఇక లేరు. హైదరాబాద్ కార్పొరేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం మధ్యాహ్నం మృతి చెందారు. ఆయన దహన సంస్కారాలు స్వగ్రామం తిమ్మాపూర్ గోదావరి నది తీరంలో ఆదివారం జరగనున్నాయి.
సూర్యారావు తిమ్మాపూర్ సర్పంచ్, గా ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ పాలకవర్గ చైర్మన్ గా, మండల పరిషత్ ఉపాధ్యక్షుడిగా, వన సంరక్షణ సమితి అధ్యక్షుడిగా, రాజకీయ ప్రస్థానం కొనసాగించిన. ఆయన ఉత్తర తెలంగాణ జిల్లా రాజకీయాల్లో సుపరిచితులు
👉 రామలక్ష్మణుల అనుబంధం..
మాజీమంత్రి రత్నాకర్ రావు, వెంకటేశ్వరరావు సూర్యారావు ముగ్గురు సోదరులు. సోదరీమణులు ఉన్నారు. 1980లో జరిగిన జగిత్యాల పంచాయత్ అధ్యక్ష ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా రత్నాకర్ రావు గెలుపులో సూర్యారావు రాజకీయ చతురత కీలకం. 1989 అసెంబ్లీ ఎన్నికల్లో అప్పటి కేంద్ర మంత్రి శివశంకర్ సమీప బంధువు బుగ్గారం అసెంబ్లీకి కాంగ్రెస్ అభ్యర్థిగా ఢిల్లీ అధిష్టానం ఎంపిక చేసింది. కాంగ్రెస్ జెండా మోసి, ఆ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేల గెలుపుకు కృషిచేసిన సీనియర్ నాయకుడు తన సోదరుడు రత్నాకర్ రావుకు టికెట్ ఎందుకు ఇవ్వలేదంటూ కాంగ్రెస్ అధిష్టానం నిలదీసిన ధీరుడు సూర్యారావు.

కాంగ్రెస్ ప్రభంజనంలో రత్నాకర్ రావు స్వతంత్ర ఎంఎల్ఏ అభ్యర్థిగా పోటీ చేయమన్నాడు. కాంగ్రెస్ పార్టీ ఆదేశాలకు వ్యతిరేకంగా పోటీ చేయడానికి రత్నాకర్ రావు నిరాకరించారు. ఈ దశలో రత్నాకర్ రావు సమకాలీకలతో, తన అనుచరాగణంతో రత్నాకర్ రావు పై ఒత్తిడి తెచ్చారు.
ఒక దశలో ఎన్నికలంటే డబ్బులతో పని మన వద్ద అంత డబ్బు లేదని రత్నాకర్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. మీరు నామినేషన్ వేయండి ప్రచార బాధ్యతలు నావి అంటూ తన అనుచర గణాంతో రత్నాకర్ రావు ఒప్పించారు. స్వతంత్ర అభ్యర్థిగా రత్నాకర్ రావు గెలుపులో సూర్యారావు దే కీలకపాత్ర .
👉1989 నుంచి కాంట్రాక్టు చేయలేదు..
సూర్యారావు ‘ ఏ’ క్లాస్ కాంట్రాక్టర్ గా గుర్తింపు ఉంది. తన సోదరుడు రత్నాకర్ రావు ఎమ్మెల్యేగా పదవి చేపట్టిన నాటి నుండి ఆయన ప్రభుత్వ కాంట్రాక్టు పనులు చేయలేదు. తన సోదరుడు ఎమ్మెల్యే రత్నాకర్ రావు పై ప్రతిపక్షాల ఆరోపణలు చేయడం తనకు నచ్చదని తన అనుచర గణం కు వివరించాడు.
👉సుప్రీంకోర్టులో విజయం సాధించాడు..
గతంలో తాను చేసిన ప్రభుత్వ కాంట్రాక్ట్ పనులలో అగ్రిమెంట్ డిజైనింగ్, మార్కింగ్ జాప్యం తదితర ప్రభుత్వ సాంకేతిక తప్పిదాల వల్ల పనులలో జాప్యం, తమకు రావాల్సిన సొమ్ము సకాలంలో రాకపోవడం తదితర అంశాలపై సూర్యారావు నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా హైకోర్టును ఆశ్రయించారు. చివరకు ఈ వివాదం వివాదం సుప్రీంకోర్టు కు చేరింది. అక్కడ సూర్యారావుకు అనుకూలంగా తీర్పురావడంతో ప్రభుత్వం దిగివచ్చి కాంట్రాక్టు డబ్బులు, నష్టపరిహారం చెల్లించంది. ధర్మపురి పట్టణంలో 1994 లో జర్నలిస్టులకు ఇంటి స్థలాలు మంజూరులో సూర్యారావు, దోనూర్ సాగర్ రావు, అప్పటి ఎమ్మెల్యే రత్నాకర్ రావు కు వివరించి ఇప్పించడం లో కీలకపాత్ర.

👉నక్సల్స్ ఇలాకా లో…
గతంలో ఉత్తర తెలంగాణ జిల్లాలలో నక్సలైట్ కార్యకలాపాలు ఉదృతం గా కొనసాగిన విషయం తెలిసిందే. ప్రత్యేకంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నక్సలైట్ల భయంతో పలువురు భూస్వాములు, దొరలు, వడ్డీ వ్యాపారులు తన వ్యవసాయ భూములు గ్రామాలను వదిలి వెళ్లారు. తిమ్మాపూర్ లో మాత్రం రత్నాకర్ రావు, సూర్యారావు లు రాత్రి పగలు స్వగ్రామంలోనే ఉండేవారు. నిరంతరం రైతాంగ సమస్యలు, నక్సల్స్ సానుభూతిపరుల పేరిట అమాయకులను పోలీసులు స్టేషన్ తీసుకెళ్లి కేసులు నమోదు చేయడం చిత్రహింసలు పెట్టడం తదితర సమస్యల పై. రాజులేని పోరాటం చేశారు. దశాబ్దన్నర కాలంగా ఉధృతంగా కొనసాగిన నక్సల్స్ కార్యకలాపాలలో సూర్యారావు రత్నాకర్ రావులపై నక్సలైట్ల పేరిట ఆరోపణలు కరపత్రాలు పంపిణీ కాలేదు. ఎలాంటి హెచ్చరికలు చేయకపోవడం వీరి నిస్వార్థ ప్రజాసేవకు నిదర్శనంగా నేటికీ జనం చర్చించుకుంటారు.
👉రాజకీయ లబ్ధి కోసం అన్నదమ్ముల మధ్య విభేదాలు సృష్టించారు !
రామలక్ష్మణుల కలిసి ఉండే రత్నాకర్ రావు సూర్యారావు ల మధ్య రాజకీయ లబ్ధి కోసం కొందరు విభేదాలు సృష్టించారు.
తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో రాజకీయ పార్టీలకు చెందిన కొందరు ప్రజాక్షేత్రంలో రత్నాకర్ రావు ఓడించలేమని, ఇద్దరు సోదరులకు సన్నిహితులుగా ఉండే కొందరితో అన్నదమ్ముల మధ్య రాజకీయ విభేదాలు సృష్టించి సూర్యారావుకు ఎమ్మెల్యే టికెట్ ఆశలు కల్పించారు. కొన్ని నెలల తరబడి సూర్యారావు ఇంటిలో మకాం పెట్టి, వాస్తవాలు, అవాస్తవాలు, వివరిస్తూ అన్నదమ్ముల మధ్య రాజకీయ అగ్ని రగల్చడంలో వారు విజయం సాధించారు. అన్నదమ్ముల మధ్య కొంత కాలం విభేదాలు ఉన్నప్పటికీ. అన్నదమ్ముల కుటుంబ సభ్యులు కలిసి ఉండడం గమన హారం.
మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్, మాజీ మంత్రి రాజేశం గౌడ్ , ధర్మపురి మున్సిపల్ చైర్పర్సన్ సంగీ సత్యమ్మ పలువురు సూర్యారావు మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు.