👉కలెక్టర్ రాహుల్ శర్మ అధ్యక్షతన …
J.SURENDER KUMAR,
కాలేశ్వర ముక్తేశ్వర దేవస్థానం అభివృద్ధికి చేపట్టిన పనుల టెండర్లు ప్రక్రియ పూర్తయిన పనులను తక్షణమే ప్రారంభించే విధంగా చర్యలు చేపట్టాలని జయశంకర్ భూపాల్ పల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు.
మంగళవారం ఐడిఓసి కార్యాలయంలో కాళేశ్వరం దేవాలయ అభివృద్ధి పనుల పురోగతిపై దేవస్థానం, రెవెన్యూ, పంచాయతీరాజ్, విద్యుత్, జాతీయ రహదారులు తదితర అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..
👉 డ్రైనేజ్ పనులు పూర్తి చేయుటకు టెండర్ల ప్రక్రియ చేపట్టాలని ఆదేశించారు.
👉కాళేశ్వరం బస్టాండ్ నుండి గోదావరి నది వద్దకు వెళ్ళు రహదారిలో ప్రమాదకరంగా స్పీడ్ బ్రేకర్స్ ఉన్నందున సౌకర్యవంతంగా మార్చాలని పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికార్లను ఆదేశించారు.
👉గోదావరి ప్రధాన ఘాట్ వద్ద స్త్రీలు బట్టలు మార్చుకునే గదులు శాశ్వత ప్రాతిపదిక నిర్మించుటకు అంచనాలు తయారు చేయాలని, అనుమతులు ఇస్తామని పేర్కొన్నారు.
👉అలాగే మెయిన్ ఘాట్ వద్ద సిసి రోడ్డు నిర్మాణానికి అంచనాలు తయారు చేయాలని ఆయన ఆదేశించారు.
👉100 గదుల సత్రం, అన్నదాన సత్రం పనులు పూర్తి చేయుటకు టెండర్ ప్రక్రియ పూర్తి చేయాలని పీఆర్ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు.
👉టాయిలెట్ బ్లాక్స్ పనులు పూర్తి చేయుటకు నిధులు మంజూరు చేశామని పనులు ప్రారంభించాలని ఆయన పేర్కొన్నారు.
👉 గ్రామపంచాయతీ కార్యాలయం ఆధ్వర్యంలో కాలేశ్వరం టోల్ గేట్ ఏర్పాటు చేసి, వచ్చే ఆదాయంతో గోదావరి నది ఘాటు వద్ద పరిశుభ్రత పనులు, స్నాన ఘట్టాలు మరియు ఘాటు వద్ద విడిచిన బట్టలు, పాలిథిన్ కవర్స్ వ్యర్ధాలను శుభ్రం చేయించు పనులు, వ్యర్దాలు ట్రాక్టర్ ద్వారా డంపింగ్ యార్డ్ కి తరలించు పనులు చేపట్టాలని ఆదేశించారు.
👉గోదావరి నది వద్ద భక్తులు పాటించాల్సిన నియమాలపై సైన్ బోర్డులు,
👉లైటింగ్ మరియు తాగునీరు సరఫరా చేయుట, భక్తుల వాహనాలు నిలుపుదల చేసేందుకు పార్కింగ్ స్థల సేకరణ చేయాలని తెలిపారు.
👉సులబ్ నుండి వెలువడే మురుగునీరు గోదావరిలో కలవకుండా పనులను చేపట్టాలని ఆదేశించారు.
👉స్త్రీలు బట్టలు మార్చుకునేందుకు శాశ్వత ప్రాతిపదిక గదుల నిర్మాణం చేపట్టాలని సూచించారు.
👉గోదావరి నది మెట్ల వద్ద భక్తులు స్నానాలు చేసేందుకు శాశ్వత షవర్లు ఏర్పాటు చేయాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు.
👉 మెయిన్ ఘాట్ వద్ద శాశ్వత ప్రాధిపదికన టాయిలెట్ బ్లాక్స్ నిర్మించుటకు ప్రణాళికలు, అంచనాలు తయారు చేయాలని పేర్కొన్నారు.
👉 మెయిన్ ఘాటు వద్ద ఏర్పాటు చేసిన రెండు మంచినీటి ట్యాంకులు వద్ద డ్రైనేజ్ లైన్ ఏర్పాటు చేయించాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులను ఆదేశించారు.
👉గోదావరి నది వద్ద భక్తులు వాహనాలు నిలిపేందుకు శాశ్వత పార్కింగ్ కొరకు స్థల ఏర్పాటు చేయాలన్నారు.
👉మెయిన్ ఘాట్ నుండి విఐపి ఘాట్ వరకు గోదావరి నది ఒడ్డున అదనపు ఘాట్ నిర్మించుటకు స్థల సేకరణ చేయాలని తహసిల్దార్ ను ఆదేశించారు.
👉మహదేవపూర్ కాలేశ్వరం క్రాస్ రోడ్ పై గతంలో ఉన్న దేవస్థానం ఆర్చి గేటును కాలేశ్వరం ప్రాజెక్టు మోటార్లు తీసుకొచ్చే సందర్భంలో తొలగించినందున తిరిగి నూతన ఆర్చ్ నిర్మించు పనులు మొదలు పెట్టాలని జాతీయ రహదారుల అధికారులను ఆదేశించారు.
ఈ సమావేశంలో కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, స్థానిక సంస్థల అధనపు కలెక్టర్ విజయలక్ష్మి, దేవస్థానం, పంచాయతీరాజ్, విద్యుత్, రెవెన్యూ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.