కార్తీక పౌర్ణమి సందర్భంగా ధర్మపురి కి పోటెత్తిన భక్తజనం!

👉పట్టణంలో ట్రాఫిక్ ఆంక్షలు..

👉ఆలయ ఆదాయం ₹ 7 లక్షలు..

J.SURENDER KUMAR,


కార్తీక పౌర్ణమి సందర్భంగా శుక్రవారం ధర్మపురి పుణ్యక్షేత్రం భక్తజనంతో పోటెత్తింది. గోదావరి నది తీరం ఆలయ ప్రాంగణం, శివాలయం, నంది చౌరస్తా, బస్టాండ్,  ఇసుక స్తంభం కూడలిలలో భక్తజనంతో కిక్కిరిసింది. పోలీసులు పట్టణంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఆలయానికి ₹ 7,61,657/ ఆదాయం వచ్చింది.


👉పంచసహస్ర దీపోత్సవంలో ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ !


సాయంత్రం పుష్కరిణిలో (కోనేరులో) పంచసహస్ర దీపాలంకరణ కార్యక్రమంలో ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్  ప్రభుత్వ అడ్లూరి లక్ష్మణ్ కుమార్  పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.


👉కోనేరులో అగ్నిమాపక సిబ్బంది..


కోనేటి మెట్లపై వేలాది నూనె ప్రమిదల వెలిగించడంలో ప్రమాద నియంత్రణ భద్రత చర్యల్లో భాగంగా అగ్నిమాపక సిబ్బంది పోలీసులు ముందస్తుగా నియమించారు. కార్బన్ డయాక్సైడ్ సిలిండర్లను సిద్ధంగా ఉంచారు.


👉గోదావరి హారతి కార్యక్రమంలో ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్,

 
స్థానిక శారదా మహిళా మండలి సభ్యులు , వాసవి మహిళా మండలి సభ్యులు తిరుమల  సేవా గ్రూప్ కరీంనగర్ సభ్యులు దేవస్థానం అర్చకులు సిబ్బంది భక్తులు శ్రీలక్ష్మి నరసింహస్వామి వారి ఆలయం నుండి మేళతాళాలతో  , హరినామ సంకీర్తనలతో గోదావరి నదివరకు వచ్చి  విశేష పూజల అనంతరం గోదావరి నదిలొ దీపాలు సమర్పించడం జరిగింది.

ఇట్టి కార్యక్రమంలో  స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ విప్ శ్రీ అడ్లూరి లక్ష్మణ్ కుమార్  దేవస్థానం  కార్యనిర్వహణాధికారి సంకటాల శ్రీనివాస్ వేదపండితులు  బొజ్జ రమేష్ శర్మ పాలెపు ప్రవీణ్ కుమార్ శర్మ సూపరింటెండెంట్ కిరణ్ , సీనియర్ అసిస్టెంట్ అలువాల శ్రీనివాస్  ఉప ప్రదాన అర్చకులు నేరెళ్ల శ్రీనివాసాచార్యులు  మున్సిపల్ చైర్మన్ శ్రీమతి సంగి సత్తెమ్మ ముఖ్య అర్చకులు నంభి శ్రీనివాసాచార్యులు  అభిషేకం పురోహితులు  బొజ్జ సంతోష్ కుమార్  రాజగోపాల్ ,  బ్రాహ్మణ అన్నదానం సత్రం సభ్యులు , అర్చకులు, సిబ్బంది  భక్తులు మహిళలు పాల్గొన్నారు .