కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్ సత్యప్రసాద్ !


J.SURENDER KUMAR,


రాయికల్ మండలంలోని మహితాపూర్ మరియు రామోజీపేట్ గ్రామాలలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను జగిత్యాల జిల్లా కలెక్టర్ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్బంగా కలెక్టర్ ధాన్యం ఎంత మొత్తంలో వస్తుంది, ధాన్యానికి సంబంధించిన తేమ ఏ విధంగా ఉందని పరిశీలించారు.

అలాగే ధాన్యాన్ని తీసుకొని దాని మ్యాచర్ ఏ విధంగా ఉంది అని తనిఖీ చేశారు. సంబంధిత ఏఈఓ ను కేంద్రం ఏ విధంగా నడుస్తుంది అని తెలుసుకున్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.


ఈ కార్యక్రమంలో జగిత్యాల ఆర్డిఓ మధుసూదన్ ఎమ్మార్వో ఖయ్యూం మార్కెట్ కమిటీ చైర్మన్ మల్లారెడ్డి సంబంధిత అధికారులు పాల్గొన్నారు.