J.SURENDER KUMAR,
ధర్మపురి, బుగ్గారం, ఉమ్మడి వెల్గటూర్ మండలంలో బుధవారం నూతన వరి ధాన్య కొనుగోలు కేంద్రాలను అధికారులు, మండల నాయకులతో కలిసి ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రారంభించారు.

ధర్మపురి వ్యవసాయ మార్కెట్ ఆవరణలో డిసిఎంఎస్ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. బుగ్గారం మండలంలో చిన్నాపూర్ ఉమ్మడి వెల్లటూరు మండలంలో జగదేవపేట్, చెర్లపల్లి, గుళ్ళకోట , రాజరాం పల్లె గ్రామాలలో ప్రారంభించారు.
