కొయ్యూరు ఎన్కౌంటర్ లో గణపతి మిస్ అయ్యాడా ?

👉 ఎన్కౌంటర్ కు  25 సంవత్సరాలు !


👉 మృతుల్లో ముగ్గు కేంద్ర కమిటీ సభ్యులు ఒకరు పశువుల కాపరి ?


J.SURENDER KUMAR,


25 సంవత్సరాల క్రితం జరిగిన కొయ్యూరు ఎన్కౌంటర్ , నక్సలైట్ ఉద్యమ చరిత్రలో, ఆ పార్టీ అగ్రనాయకత్వంలో ప్రకంపనలు గందరగోళం  సృష్టించిందని చెప్పవచ్చు. కొయ్యూరు ఎన్కౌంటర్ లో  మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యులతో పాటు  పశువుల కాపరి హతమైన విషయం తెలిసిందే.

అయితే  ఎన్కౌంటర్ ఎపిసోడ్ లో నాటి మావోయిస్టు అగ్రనేత ముప్పాల లక్ష్మణ రావు, @ గణపతి  మిస్ అయ్యాడా ?  అనే చర్చ నాటి నుండి  జరుగుతుంది. 1999 డిసెంబర్ 2న జరిగిన ఎన్కౌంటర్ కు  రేపటికి 25 సంవత్సరాలు కానున్నది.


👉 ఎన్కౌంటర్ లో హతమైంది..


నక్సలైట్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కొత్తగట్టు గ్రామానికి చెందిన నల్ల ఆదిరెడ్డి, వరంగల్ జిల్లా దేవరుప్పుల మండలం కడ వెండికి చెందిన ఎర్రం రెడ్డి సంతోష్ రెడ్డి,  జగిత్యాల జిల్లా కేంద్రం కు చెందిన శీలం నరేష్,లతో పాటు, సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డి ప్రాంతానికి చెందిన ఎడ్ల లక్మి రాజం లు హతమైనట్టు  నాడు పోలీసులు ప్రకటించారు. అయితే హతుడు ఎడ్ల లక్మి రాజం మిలిటెంట్ గా ప్రచారం జరిగింది.

👉 ఎన్కౌంటర్ జరిగింది ఇలా… పోలీసుల కథనం..

తమకు అత్యంత నమ్మకంగా అందిన సమాచారం మేరకు కొయ్యూరు అటవీ ప్రాంతంలో నక్సల్స్ సమావేశమైనట్టు తెలిసింది. ఆ ప్రాంతంలో  పోలీసులు కూమింగ్ నిర్వహిస్తున్నారు, అటవీ ప్రాంతంలో అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తులు పోలీస్ పై కాల్పులు జరిపారు, తాము ఆత్మరక్షణ కోసం ఎదురు కాల్పులు జరగగా వారు హతమయ్యారు నక్సల్స్ సానుభూతిపరుల తో మృతదేహాలను పరిశీలించగా మృతులు నక్సలైట్ నాయకులని వారు గుర్తించినట్టు నాటి ఎన్కౌంటర్ పై పోలీసు వర్గాల కథనం.

👉 నక్సల్స్ ఉద్యమ చరిత్రలో వారిది కీలక పాత్ర !

ఎన్​కౌంటర్​లో హతమైన ముగ్గురు నాయకులు పార్టీ నిర్మాణంలో, ప్రజాస్వామ్య ఉద్యమ నిర్మాణంలో గేరిల్లా దాడులలో అత్యంత కీలకం, వీరు విద్యావేత్తలు, నాటి నక్సల్స్ ఉద్యమంలో అగ్రనేత గణపతి సమకాలీకులు గా ఆ పార్టీ సానుభూతిపరుల లో వీరికి గుర్తింపు ఉంది.


ఉద్యమ నాయకత్వ ఆదిపత్య పోరులో ఎన్కౌంటర్ లో హతమైన ముగ్గురి నాయకుల కదలికలను గణపతి బహిర్గతం చేశాడనే ఆరోపణలు వారి మృతదేహాలు పోస్టుమార్టం కంటే ముందే విస్తృతంగా వ్యాపించాయి.

👉 గణపతి స్వదస్తూరి తో ప్రకటన విడుదల !


కడవెండి  గ్రామంలో  ఎర్రంరెడ్డి సంతోష్ రెడ్డి దహన సంస్కారాలు అనంతరం స్మశాన వాటికలో పౌర హక్కుల నాయకుడు వరవరరావు, నక్సలైట్ నాయకుడు గణపతి ఎన్కౌంటర్ జరిగిన తీరుపై ప్రజలను ఉద్దేశించి రాసిన లేఖను వరవరరావు చదివి వినిపించారు. ప్రసార మాధ్యమాలను ప్రచురితమయ్యాయి.


దాని సారాంశం బెంగళూరులోని  డేన్ ఇంచార్జ్ గోవింద్ రెడ్డి చేసిన నమ్మక ద్రోహంతో ముగ్గురు కేంద్ర కమిటీ నాయకులను పోలీసులు అదుపులో తీసుకొని ఎన్కౌంటర్ చేశారనేది పత్రికా ప్రకటన సారాంశం.

👉 25 సంవత్సరాల క్రితమే గణపతి టార్గెట్ ?

నక్సలైట్ ఉద్యమ కట్టడికి కోవర్టు ఆపరేషన్  కరీంనగర్ జిల్లాలో  శ్రీకారం అని చెప్పవచ్చు. హుస్నాబాద్ దళ నాయకుడు భూపతి @ కోడి ముంజ మల్లయ్య తో పాటు మరో ముగ్గురు హతమైన సంఘటనలో (కోవర్ట్ ఆపరేషన్ లో) కత్తుల సమ్మయ్య పాత్ర ప్రధాన మనేది జగమెరిగిన సత్యం.


ఈ నేపథ్యంలో కీలక నేత ముప్పాళ్ళ లక్ష్మణరావు @ గణపతి ని టార్గెట్ గా గ్రేహౌండ్స్ పోలీస్ ఉన్నతాధికారులు పక్కాగా స్కెచ్ వేసినట్టు చర్చ. అజ్ఞాత జీవనం కొనసాగిస్తున్న ఖమ్మం జిల్లాకు చెందిన గోవిందరెడ్డి కదలికలపై ఉన్నత స్థాయి కీలక అధికారులు నిఘా ఏర్పాటు చేసినట్టు చర్చ. ఈ నేపథ్యంలో బెంగళూరులో డేన్ కీపర్ గా  గోవిందరెడ్డి కుటుంబంతో నివాసం గా గుర్తించినట్టు చర్చ.


డేన్ కీపర్ గోవిందరెడ్డి ( డేన్ అంటే జనవాసాల మధ్య కుటుంబ సభ్యులతో ఉండే నివాసాలను నక్సల్స్  వాటిని సమావేశాల కోసం వాడుకుంటారు వాటిని డేన్ గా పిలుస్తారు ) గణపతి తో సహా కేంద్ర కమిటీ సభ్యులు కొందరు ఆ ఇంటిలోనే సమావేశం లో పాల్గొంటారని పక్కా సమాచారంతో పోలీసుల అక్కడ మాటు వేసినట్టు చర్చ.

అయితే ఆరోజు గణపతి ఆ ఇంటికి రాకపోయి ఉండవచ్చు. దీనికి తోడు కొయ్యూరు ఎన్కౌంటర్ జరిగిన కొన్ని గంటల్లోనే గోవిందరెడ్డి డేన్ కీపర్ కుటుంబ సభ్యులతో సహా బెంగళూరు నుంచి అదృశ్యమైనట్టు  నాడు నక్సల్స్ ఓ ప్రకటన జారీ చేశారు. కొయ్యూరు ఎన్కౌంటర్ గోవిందు రెడ్డి కోర్టుతోనే జరిగిందనేది నక్సలైట్ నాయకుల ఆరోపణ.

👉మిస్టరీ..

సిరిసిల్ల జిల్లాకు చెందిన పశుల కాపరి, మిల్టెంట్ ఎడ్ల లక్మి రాజం, కొయ్యూరు ఎన్కౌంటర్ లో కేంద్ర కమిటీ సభ్యులతోపాటు హతం కావడం దీనికి తోడు  ముగ్గురు కేంద్ర కమిటీ సభ్యులు మిలిటెంట్ లక్మీరాజం తో కొయ్యూరు అటవీ ప్రాంతంలో సమావేశం జరుపుతారా ? లేదా లక్మీరాజం  నేరుగా కేంద్ర కమిటీ సభ్యులతో సమావేశంలో పాల్గొంటాడా ?  అనేది ఆ పార్టీ వర్గాలలో నేటికీ అంతు పట్టని మిస్టరీగా ఉంది.

👉 వివాదాస్పదమైన మెడల్ !

విధి నిర్వహణలో ధైర్య సహసాలు, అత్యంత ప్రతిభ కనబరిచిన పోలీసులకు భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన ఇండియన్ పోలీస్ మెడల్ ( IPM ) ఇచ్చి గౌరవిస్తుంది. అయితే కొయ్యూరు ఎన్కౌంటర్ అంశంలో పోలీసులకు ప్రధానం చేయాల్సిన ఈ మెడల్ అర్హుల ఎంపిక విధానం పై ప్రచార మాధ్యమాల్లో పలు రకాల వార్తా కథనాలు ప్రచురితమయ్యాయి..

👉 పీఎల్​జీఏ ఆవిర్భావం..

కొయ్యూరు ఎన్​కౌంటర్ అనంతరం ప్రతి ఏటా డిసెంబర్ 2 నుంచి వారం రోజుల పాటు మావోయిస్టు పార్టీ  పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ గెరిల్లా వారోత్సవాలను నిర్వహిస్తుంది. కొయ్యూరు ఎన్కౌంటర్   మృతులను  స్మరిస్తూ  మావోయిస్టు పార్టీ వారోత్సవాలను నిర్వహిస్తుంటారు.


ఇది ఇలా ఉండగా జరిగిన కొయ్యూరు ఎన్కౌంటర్ తీరు, గణపతి పై ఆరోపణలు రావడం, ఎన్కౌంటర్ జరిగింది ఇలా అంటూ గణపతి పత్రిక ప్రకటన జారీ చేయడం, ఎన్కౌంటర్ లో కేంద్ర కమిటీ సభ్యులతో పాటు పశువుల కాపరి ( మిలిటెంట్ ) మృతి చెందడం, డేన్ ఇంచార్జ్ గోవిందరెడ్డి అదృశ్యం, తదితర ఉదంతాల నేపథ్యంలో కొయ్యూరు ఎన్కౌంటర్ లో మావోయిస్టు అగ్రనేత ముప్పాల లక్ష్మణరావు @ గణపతి గా టార్గెట్ చేసినా మిస్ అయ్యాడనే చర్చ గత రెండున్నర దశాబ్దాల కాలంగా జరుగుతూనే ఉంది.