👉 జగ్దల్ పూర్ జైల్లో సారంగాపూర్ మండల వాసి పోగుల రాజేశం !
👉 బెయిల్ నిరాకరించిన ఎన్ఐఏ కోర్టు !
J.SURENDER KUMAR,
అనుమానస్పద మృతి చెందిన కూతురి మృతదేహాన్ని కడసారి చూసేందుకు ఆ తండ్రి కి ఉరట లభించలేదు. తండ్రి ఛత్తీస్గడ్ రాష్ట్రం జగదల్పూర్ జైలు అండర్ ట్రయల్ ఖైదీగా ఉన్నాడు. తండ్రికి ఎన్ఐఏ కోర్టు బెయిల్ నిరాకరించింది.
👉 వివరాలు ఇలా ఉన్నాయి.
జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలం రేచపల్లి గ్రామానికి చెందిన పోగుల రాజేశం కూతురు
చంద లత (పోగుల లత) నిర్మల్ జిల్లా దస్తురాబాద్ మండలం రేవోజీపేట గ్రామంలో ఈనెల 8 న అత్తవారింటిలో అనుమానస్పదంగా మృతి చెందింది.

లత తండ్రి రాజేశం అంత్యక్రియల్లో పాల్గొనడం కోసం పౌర హక్కుల సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మాధన కుమార స్వామి, తెలంగాణ జన సమితి జగిత్యాల జిల్లా అధ్యక్షులు చుక్క గంగారెడ్డి లు పోగుల రాజేశం భార్య పోగుల మల్లేశ్వరి జగదల్పూర్ కోర్టులో బెయిల్ పిటిషన్ వేశారు.
ఎన్. ఐ.ఎ. కోర్టు బెయిల్ తిరస్కరించంది దీంతో కుటుంబ సభ్యులు మంగళవారం ఉదయం రేచపల్లి లో లత అంత్య క్రియలు నిర్వహించనున్నారు.
మావోయిస్టు సానుభూతిపరుడు, సహకరిస్తున్నాడు అంటూ తదితర ఆరోపణలతో పోగుల రాజేషంను రేచపల్లి లో ఫిబ్రవరిలో ఎన్ఐఏ బృందాలు, ఛత్తీస్గడ్ పోలీసులు అదుపులో తీసుకొని చత్తిస్గడ్ కు తరలించిన విషయం తెలిసిందే.