కుటుంబ సర్వేకు సహకరించాలి ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ !


J.SURENDER KUMAR,


కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే కార్యక్రమానికి ప్రజలు స్వచ్ఛందంగా సహకరించాలని
ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.


ధర్మపురి మున్సిపల్ ఆవరణలో బుధవారం ఏర్పాటు చేసిన సమగ్ర కుటుంబ సర్వేకు సంబంధించిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.


ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ


రాష్ట్రంలో పేదవారు ఎంత మంది ఉన్నారు, ఎంత మందికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందుతున్నాయి, ఇంకా ఎంత మందికి అందాల్సి ఉంది అన్న తదితర విషయాలను తెలుసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వేను నిర్వహించడం ప్రారంభమైంది అన్నారు.


ఈ సర్వేలో ఒక కుటుంబానికి సంబంధించిన పూర్తి వివరాలను అధికారులు సేకరించడం జరుగుతుందనీ, దాని వల్ల ప్రభుత్వం నుండి వచ్చే సంక్షేమ పథకాలకు అర్హత పొందే అవకాశం ఉంటుందనీ, అధికారులు కూడా ప్రజలనుండి కచ్చితమైన వివరాలను సేకరించాలని ఎమ్మెల్యే కోరారు.
,ప్రజలు అధికారులకు సహకరించి వివరాలు వారికి ఇవ్వాల్సి ఉంటుందనీ ఈ సందర్భంగా అన్నారు.


ఈ కార్యక్రమంలో అధికారులు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు